శీతాకాలంలో ఉసిరికాయలు చాలా విరివిరిగా లభ్యమవుతాయి. ఉసరికాయ,తేనే కలిపి తీసుకుంటే ఎన్నో అద్బుత ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ఈ సీజన్లో వచ్చే ఆరోగ్య సమస్యలను తగ్గించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఉసిరికాయల్లో, తేనెలో ఎన్నో పోషకాలు ఉన్నాయన్న సంగతి మీకు తెలుసా.
హెల్తీ లివర్ కోసం
ఉసిరికాయ, తేనె ఈ రెండింటిలోనూ యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ వంటి గుణాలతోపాటు శరీర వ్యాధినిరోధక వ్యవస్థను పటిష్టం చేసే గుణాలు వీటిలో ఉన్నాయి. అయితే ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల ఎన్నో అద్బుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి తేనెలో నానబెట్టిన ఉసిరికాయను ప్రతిరోజూ ఉదయం పరగడుపున తినడం వల్ల కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. జాండిస్ సమస్యను నివారిస్తుంది.
అజీర్తి, ఎసిడిటి సమస్యలకు విరుగుడు
లివర్ ల చేరిన బైల్ పిగ్మెంట్, టాక్సిన్స్ ను తొలగిస్తుంది. దీంతో కాలేయం మరింత చరుకుగా పనిచేసేలా చేస్తుంది. తేనెలో నానబెట్టిన ఉసిరికాయ అజీర్తి, ఎసిడిటి సమస్యలకు మంచి విరుగుడు లాంటిది. అంతేకాదు ఆకలిని పెంచడంలో సహాయం చేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. తేనెలో నానబెట్టిన ఉసిరికాయ ద్రవాన్ని తాగడం వల్ల మలబద్ధకంతోపాటు ఫైల్స్ ససమ్య నుంచి తక్షణం ఉపశమనం కలిగిస్తుంది.
దగ్గు, గొంతు ఇన్ఫెక్షన్లకు
శీతాకాలంలో దగ్గు, జలుబు, గొంతు ఇన్ఫెక్షన్ వంటి వ్యాధులు ఇబ్బంది కలిగిస్తుంటాయి. ఈ వ్యాధులకు తేనె, ఉసిరికాయతో చెక్ పెట్టవచ్చు. శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వును కూడా కరిగించడంతోపాటు అధిక బరువు సమస్య ఉన్నవారికి ఎంతో ప్రయోజనం కలుగుతుంది. ప్రతిరోజు ఉదయం ఈ తేనె ఉసిరికాయను తీసుకున్నట్లయితే…చర్మంపై ముడతలు తగ్గి మరింత యవ్వనంగా కనిపిస్తారు.
తయారీ విధానం
ఒక జార్ లో సగం వరకు తేనె పోసి దానిలో కడిగి ఆరబెట్టిన ఉసిరికాయలను వేయాలి. తర్వాత మూత గట్టిగా పెట్టి పక్కకు పెట్టాలి. కొద్ది రోజులకు ఉసిరికాయలు జామ్ లా తయారవుతాయి. అనంతరం వాటిని తీసి రోజుకోటి తీసి అదే జార్ లోని తేనెతో కలిపి ఉదయాన్నే పరగడుపున తినాలి.
ALSO READ: టాస్ గెలిచిన టీమిండియా.. ఫస్ట్ బ్యాటింగ్ మనదే
‘నాతో చేతకాక.. నా కొడుకుపై కేసు పెట్టిస్తావా..?’ కేసీఆర్పై బండి సంజయ్ ఫైర్
మీరు సుకన్య సమృద్ధి స్కీంలో చేరాలనుకుంటున్నారా..అయితే మీకు గుడ్న్యూస్..!