super food for young look, food, young, woman, care, middle age, healthy
mictv telugu

యంగ్ గా కనిపించాలంటే ఇవి తినాల్సిందే…

November 15, 2022

పని వత్తిడి,ఉరుకులు పరుగుల జీవితం….దీనివల్ల చాలా మంది ఆడవాళ్ళు తమ శరీరంమీద శ్రద్ధ పెట్టలేకపోతున్నారు. దీనివల్ల వాళ్ళ అసలు వయసు కంటే ఎక్కువ ముసలిగా కనిపిస్తున్నారు. దీనికి చెక్ పెట్టాలంటే….ఎక్కువ కష్టపడకుండా…యంగ్ గా కనిపించాలంటే కొన్ని ఫుడ్స్ తీసుకుంటే చాలంటున్నారు. రోజూ మనం తినే ఆహారంలో ఇవి చేర్చుకుంటే చాలు యంగ్ లుక్ మీ సొంతం అని చెబుతున్నారు.

మనం రోజూ తినే ఆహారాన్నే కొద్దిగా మార్పులు చేసి తీసుకుంటే అద్భుతాలు జరుగుతాయి. మనకు తెలియకుండానే మన శరీరం కొత్తగా తయారవుతుంది. మనకు నిత్యం దొరికే, అందుబాటులో ఉండేవే మనకు ఎలా తోడ్పడతాయో తెలుసుకుందాం రండి.

ఆడవాళ్ళు రోజూ పాలు తాగడం మంచిది. పాలల్లో ఉండే ప్రోటీన్ వాళ్ళకు ఎంతగానో సహాయం చేస్తుందిట. అయితే కొవ్వులేకుండా ఉండే పాలను మాత్రమే తాగాలి. పాలల్లో కాల్షియం, విటమిన్ డి, సిలు ఎక్కువగా ఉంటాయి.

ఆడవాళ్ళకు టమాటాలు మెడిసిన్ తో సమానం. దీనిలో ఉండే లైకోపీన్ రొమ్ము క్యాన్సర్ ను తగ్గిస్తుంది. అంతేకాదు టమాటాలు రోజూ తినడం వల్ల యవ్వనంగా కనిపిస్తారుట. ఇవి చర్మాన్ని తాజాగా, ఆరోగ్యంగా ఉంచుతాయిట.తరువాతది సోయా. సోయాలో పోణకాలు పుష్కలంగా ఉంటాయి. విటమిన్స్, ఐరన్ ఎక్కువగా ఉండే సోయా తింటే స్త్రీలు అన్నిరకాలుగా ఆరోగ్యంగా ఉంటారు.

డ్రైఫ్రూట్స్….వీటికి గురించి కొత్తగా చెప్పుకునేదేముంది, అందరికీ తెలిసినదే. వీటిని ప్రతీరోజూ అందరూ తీసుకోవాలి. ఇందులో ఉండే విటమిన్ బి12, ఇ లు శరీరానికి బలాన్ని ఇస్తాయి.

బెర్రీలు….బ్లూబెర్రీ, రాస్ బెర్రీ, క్రాన్ బెర్రీ, స్ట్రాబెర్రీ ఏదైనా తినండి….దేన్ని తిన్నా చాలా మంచిది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. బెర్రీల్లో క్యాన్సర్ ను నిరోధించే గుణాలు చాలా ఎక్కువ ఉంటాయిట. అలాగే మన చర్మం నిగనిగలాడడానికి కూడా ఇవి ఎంతో ఉపయోగపతాయి అని చెబుతున్నారు.

పైన చెప్పినవే కాదండీ…గ్రీన్ టీ, డార్క చాకొలెట్, అవిసె గింజలు లాంటివి కూడా మనం యవ్వనంగా కనిపించడానికి సహాయం చేస్తాయిట. ప్రతీరోజూ మనం తీసుకునే డైట్ లో ఇవి ఎంతో కొంత ఉండేటట్టు చూసుకుంటే అందం, ఆరోగ్యం మనం సొంతం అవుతాయి. మరింకెందుకు ఆలస్యం ఈరోజు నుంచే మీ డైట్ మార్చేయండి…అందంగా, ఆనందంగా ఉండండి.