మానవమేథస్సు చాలా పెరుగుతోంది. ప్రయోగాలు చాలా ఎక్కువ అవుతున్నాయి ఇవి మనకు మంచే చేస్తున్నాయి కానీ అప్పుడప్పుడు వీటివలన నష్టాలు కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు అలాంటి విషయమే ఒకటి బయటపడింది. మానవుల సృష్టించిన ఒక జంతుజాతి అదే మానవులకు హాని కలిగించేవిధంగా తయారయింది.
సూపర్ పిగ్స్ తో జాగ్రత్త అంటున్నారు సైంటిస్టులు. అడవి పందులు, మామూలు పందులను కలిపి పుట్టించిన సంకర జాతే ఈ సూపర్ పిగ్ లు. ఈ పందులు ఒక్కోటీ 289 కేజీలు ఉంటాయి. ఈ సూపర్ పిగ్ లు చిన్న చిన్న జంతువులను కూడా తింటాయిట. మామూలుగా వైల్డ్ బోర్స్ కానీ, పందులు కానీ శాకాహారులుగా ఉంటాయి. కానీ ఈ సూపర్ పిగ్ జాతి మాత్రం మాంసాహారిట. అంతేకాదు ఇవి చాలా తెలివైనవి అని కూడా చెబుతున్నారు. ఎక్కవు మంచు ప్రాంతాల్లో ఉండే ఈ పంది జాతికి ఒంటి మీద బొచ్చు ఎక్కువగా ఉంటుంది. మంచులో బొరియలు తవ్వుకుని తమను తాము ఎలా కాపాడుకోవాలో ఈ పందులకు బాగా తెలుసుట. అందుకే వీటిని చాలా తెలివైనవి అంటున్నారు.
ఇంతకు ముందు ఇవి చాలా తక్కువే ఉండేవి అని చెబుతున్నారు. కెనడాలో 2000 తర్వాత పోర్క్ మీట్ వాడకం ఎక్కువైంది. అప్పటి నుంచి పందులను పెంచడం ఎక్కువైంది. యూరోస్ నుంచి వైల్డ్ బోర్ లు కెనడాకు రవాణా అయ్యేవి. అక్కడి వాళ్ళు ఆ అడవి పందులను, మామూలు పందులతో కలిపి క్రాస్ బ్రీడ్ చేశారు. మొదట్లో వీటిని జాగ్రత్తగా ఒకచోట ఉంచి పెంచేవారు. కానీ తర్వాత వీటిని పొలాల్లోకి వదిలేస్తున్నారు. దీనివల్ల అక్కడి పంటలు చాలా నాశనం అయిపోతున్నాయి. అదేకాకుండా ఈ పందులవల్ల మనుషులకు వచ్చే వ్యాధుల గురించి చెపితే పెద్ద లిస్టే తయారవుతుంది అంటున్నారు సైంటిస్టులు. వీటివల్ల జుట్టు తెల్లగా అవ్వడం లాంటి ప్రాబ్లెమ్స్ కూడా చాలానే వస్తాయి అంటున్నారు. ఈ పందులు అభివృద్ధి చెందిన చోట ఎన్విరాన్ మెంట్ దాదాపు 500 ఏళ్ళు దెబ్బతింటుందని చెబుతున్నారు.