super star krishna did 43 films with one heroine
mictv telugu

ఒకే హీరోయిన్ తో 43సినిమాలు.. ఆమె మరెవరో కాదు

November 15, 2022

super star krishna did 43 films with one heroine

మహేష్ బాబు తండ్రి తొలితరం తెలుగు సూపర్ స్టార్ కృష్ణ ఈ రోజు కన్నుమూయటం సౌత్ సినీ వర్గాలకు అత్యంత విషాదకరమైన రోజు. నవంబర్ 13న గుండెపోటు రావడంతో హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చేరి వెంటిలేటర్‌పై ఉంచగా తెల్లవారుజామున మరణించారు. సీఎం కేసీఆర్, చంద్రబాబు, మంత్రి కేటీఆర్ లతో పాటు.. చిరంజీవి, అల్లు అర్జున్, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, వెంకటేష్, సమంత రూత్ ప్రభు వంటి ప్రముఖులు ఘట్టమనేని కుటుంబానికి సానుభూతి తెలిపారు. ఇక కృష్ణ కెరీర్ లో 350కి పైగా సినిమాల్లో నటించి, సినీ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేశారు.

అయితే సినీ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన ఆయన ఒకే నటితో అత్యధిక సినిమాలు చేసిన హీరోగా అరుదైన రికార్డు కూడా సాధించారు. కృష్ణ తన సతీమణి, నిర్మాత, నటి విజయ నిర్మలతో 43 సినిమాలు (సుమారు) చేయగా.. మరో నటి జయప్రదతో 43 సినిమాల్లో నటించారు. ఇక కృష్ణ, శ్రీదేవి కాంబినేషన్లో 31 సినిమాలు వచ్చాయి. తన సిని జీవితంలో సూపర్‌ స్టార్‌ కృష్ణ మొత్తంగా 80 మంది హీరోయిన్లతో నటించారు. ఇక బంధువుల కడచూపు తర్వాత కృష్ణ భౌతిక దేహాన్ని అభిమానుల సందర్శనార్థం నేడు సాయంత్రం ఇంటి నుండి గచ్చిబౌలి స్టేడియానికి తీసుకెళ్లనున్నారు. ఇక రేపు ఉదయం కృష్ణ పార్థివదేహానికి మహాప్రస్థానం శ్మశానవాటికలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.