super star Krishna last movie sri sri disappointment
mictv telugu

కృష్ణ చివరి సినిమా.. శ్రీశ్రీ ఓ డిజాస్టర్

November 15, 2022

సూపర్ స్టార్ కృష్ణ హీరోగా తొలి చిత్రం ‘తేనె మనసులు’ ఆయన కెరీర్‌లో కీలక మలుపైతే ఆఖరి చిత్రం ‘శ్రీశ్రీ’ ఎవరికీ గుర్తులేనంతగా కాలగర్భంలో కలసిపోయింది. ఎన్నో సూపర్ డూపర్ హిట్లు అందించిన బుర్రిపాలెం బుల్లోడి శ్రీశ్రీని నేటి ప్రేక్షకులు పట్టించుకోలేదు. దిగ్గజ దర్శకుడు ముప్పలనేని శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ 2016లో విడుదలైంది. కృష్ణతోపాటు నరేశ్, విజయనిర్మల, సాయికుమార్ వంటి దిగ్గజ తారాగణం ఉన్నా ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు. 70 ఏళ్ల దాటిన కృష్ణ, 60 ఏళ్లు దాటిన విజయనిర్మల ప్రధాన పాత్రలు కావడం, కథలో పస లేకపోవడం దీనికి కారణం. అంత లేటు వయసులో కృష్ణ, విజయ నిర్మలను ఆదర్శ ప్రేమపక్షులుగా చూపించడం కొంచెం జీర్ణించుకోలేని విషయంగానే ప్రేక్షకులు భావించారు.

ఈ మూవీలో కృష్ణ శ్రీపాద శ్రీనివాసరావు(శ్రీశ్రీ) అనే రిటైర్డ్ లా కాలేజీ ప్రొఫెసర్ పాత్రలో నటించారు. ఆయన కూతురు (అంగతారాయ్)ని శక్తిమంతమైన విలన్లు చంపేవారు. వారిపై శ్రీశ్రీ ఎలా పగ తీర్చుకున్నారనేదే కథ. తొలి అర్ధభాగంలో కాస్త ఆసక్తి రేకెత్తించనా రెండో అర్ధభాగం ప్రేక్షకులను పూర్తిగా నిరాశపరుస్తుంది. కృష్ణ తన పాత్రకు న్యాయం చేసినా కథనం సరిగ్గా లేకపోవడం, ‘ఓల్డ్ పీపుల్’ ప్రధాన పాత్రల్లో కనిపించడం ఈ చిత్రాన్ని దెబ్బతీసింది. ఈ చిత్రానికి ముందు సూపర్ స్టార్ తన కొడుకు మహేశ్ బాబు నటించిన ‘సుకుమారుడు’ చిత్రంలోపాటు అడపాదడపా కొన్ని చిత్రాల్లో అతిథిగా నటించారు.