super star krishna passed away and krishna fight with sp balasubrahmanyam
mictv telugu

కృష్ణకి.. ఎస్పీబీతో తీవ్ర విభేదాలు…

November 15, 2022

దానధర్మాలకు, మానవత్వానికి మరో రూపం సూపర్ స్టార్ కృష్ణ అంటారు. అయితే సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్నట్టే కానీ స్థాయికి తగ్గ ఆస్తులని కృష్ణ పెద్దగా పోగేసుకోలేదని ఇండస్ట్రీ వర్గాల టాక్. తన అమాయకత్వంతో ఎన్నో వందల కోట్లు ఇండస్ట్రీలో పోగొట్టుకున్నారని అంటారు. నమ్మిన మిత్రులు మోసం చేయటం, అభిమానుల పేరుతో కృష్ణని బురిడీ కొట్టించటంతో చెన్నై, హైదరాబాద్ లో ఎన్నో భూములని అమ్మేశాడట కృష్ణ. అభిమాని ఆపదలో ఉంటే చాలు జేబులో ఉన్న డబ్బుని దానం చేసేవాడు కృష్ణ. నిర్మాతలకి నష్టాలు వస్తే రెమ్యునరేషన్ తిరిగి ఇచ్చేయటం, డబ్బులు తీసుకోకుండా వారితో సినిమాలు చేయటం, రేంజికి తగ్గ రెమ్యునరేషన్ డిమాండ్ చేయకపోవటం, అందరితో దయాదాక్షిణ్యాలతో మెలిగేవారు కృష్ణ. అయితే అలాంటి మంచి మనసున్న కృష్ణకి.. లెజండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యంతో తీవ్ర స్థాయిలో మనస్పర్థాలు అప్పట్లో వచ్చాయట. ఇదే విషయాన్నీ ఎస్పీబీ కూడా స్వయంగా పలు సందర్భాల్లో వెల్లడించారు.

ఎస్పీ బాలసుబ్రమణ్యం స్టార్ సింగర్ గా ఒక్కో మెట్టు ఎక్కుతున్న రోజులవి. చిన్న హీరోలు, కమెడియన్స్ కి గాత్రం అందిస్తున్న సమయంలో సూపర్ స్టార్ కృష్ణ ఎస్పీబీకి తన సినిమాలో అవకాశం ఇచ్చారు. అక్కడి నుండి వరుసగా కృష సినిమాలకు పాడుతూ వచ్చారు ఎస్పీబీ. అయితే కృష్ణ సినిమాలకు మధ్యలో ఇతర చిత్రాలకు కూడా పాడుతున్న ఎస్పీబీని పిలిపించుకుని.. నేను అవకాశం ఇస్తున్నా కదా కమెడియన్స్ కి, చిన్న హీరోలకి పాటలు పాడటం ఆపేయాలని ఎస్పీబీని అడిగాడట కృష్ణ. అయితే సినిమా రెమ్యునరేషన్ విషయంలోనూ ఎస్పీబీతో కృష్ణకి గొడవ జరిగిందట. ఆ రెమ్యూనరేషన్ కూడా తిరిగి ఇవ్వండని అడిగారట. అలా రెమ్యూనరేషన్ విషయంలో జరిగిన గొడవతో రెండేళ్ల పాటు కృష్ణకు బాలు పాడకుండా దూరంగా ఉండిపోయారట. అయితే ఎస్పీబీకి మధ్యలో అవకాశాలు లేకుండా ఖాళీగా ఉన్న సమయంలోనే కృష్ణ ఆదుకున్నారు. ఏడాదిలో నావి ఆరేడు చిత్రాలు వస్తాయి.. అవన్నీ నువ్వే పాడు అని ఎస్పీబీకి కృష్ణ భరోసా ఇచ్చారట.