super star krishna passed away without fulfilling the last wishes
mictv telugu

ఆ రెండు చివరి కోరికలు తీరకుండానే.. కన్నుమూసిన సూపర్ స్టార్ కృష్ణ

November 15, 2022

super star krishna passed away without fulfilling the last wishes

సూపర్ స్టార్ కృష్ణ 79 సంవత్సరాల వయసులో కన్నుమూశారు. తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఆయన తుది శ్వాస విడిచారు. కృష్ణ అకాల మరణం యావత్ తెలుగు చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. నవంబర్ 14న అర్ధరాత్రి కృష్ణకు గుండెపోటు రాగ.. అపస్మారక స్థితిలో ఆసుపత్రికి తరలించారు.

20 నిమిషాల CPR తర్వాత కృష్ణని కాపాడారు డాక్టర్లు. అయితే నిన్న సాయంత్రం నుండి శరీరంలోని అవయవాలన్నీ పాడవుతూ వస్తుండటంతో.. కృష్ణ ప్రాణాలని కాపాడలేకపోయామని ఆసుపత్రి వర్గాలు చెప్పాయి. ఈ సందర్భంగా సూపర్ స్టార్ కృష్ణ అప్రతిహత సినీ జర్నీ కథనాలు మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఇండస్ట్రీలో కృష్ణ నెలకొల్పిన రికార్డులపై పెద్ద చర్చ నడుస్తుంది. తోలి జేమ్స్ బాండ్ చిత్రం, తోలి కౌబాయ్ సినిమాని వెండితెరపై చూపెట్టిన ధీరుడు కృష్ణ. ఒకే సంవత్సరంలో 24సినిమాలు, ఒకే రోజులో 4చిత్ర షూటింగ్స్ చేయటం కృష్ణ కెరీర్ లో ఆల్ టైం రికార్డ్స్. కృష్ణ చేయని సాహసం లేదు, ప్రయత్నించని ప్రయోగం లేదు. ఎన్టీఆర్, ఏఎన్నార్ లకి పోటీగా దూసుకెళ్లిన శ్రమజీవి, టాలీవుడ్ కి తొలితరం సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ.

అయితే కెరీర్ లో ఎన్నో అద్భుతాలు చేసిన కృష్ణ తన చివరి రెండు కోరికలు తీరకుండానే చనిపోయాడన్న న్యూస్ ఒకటి వైరల్ అవుతుంది. కృష్ణకి చారిత్రాత్మక పాత్రలంటే ఇష్టం. అల్లూరు సీతా రామరాజుగా ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసిన కృష్ణకి ఛత్రపతి శివాజీ జీవిత చరిత్రపై సినిమా తీయాలన్నది చిరకాల కోరిక. అయితే ఆ సినిమా తీయకుండానే కన్నుమూశారు కృష్ణ. ఛత్రపతి శివాజీ పాత్ర చేయాలనీ కోరికతో ఎన్నో కథలని వినేవాడట. అయితే ముస్లిం సోదరుల మనోభావాలు దెబ్బతీయొద్దన్న మంచి అభిప్రాయంతో సినిమాని కృష్ణ పక్కనపెట్టాడట. శివాజీ మహారాజ్ పాలనలో.. బ్రిటిష్ వారిపై తిరగబడ్డ ఎక్కువగా విదేశీ ముస్లిం రాజులతో పోరాటాలు చేసేవాడు శివాజీ. అరబ్ దేశాల నుండి భారత్ పై దండయాత్రకు దిగిన విదేశీ ముస్లిం రాజులతో వీరోచిత పోరాటం చేసిన ఛత్రపతి పాత్ర అంటే ఇష్టమైనా.. నేటి మన సమాజంలో ముస్లిమ్స్ అంతర్భాగం. వారు కూడా నేడు భారతీయులే. అందువల్లే వారిని ఇబ్బంది పెట్టొద్దని శివాజీ బయో పిక్ ని పక్కనపెట్టాడట కృష్ణ. ఇక మహేష్ బాబుతో చిన్నప్పుడు పలు సినిమాలు తీసినా.. సూపర్ స్టార్ అయ్యాకా ఒక చిత్రం తీయాలని కోరికగా ఉండేదట కృష్ణకి. కానీ మహేష్ తో ఒక్క సినిమా నిర్మించాలన్న కోరిక కూడా తీరకుండానే కన్నుమూశారు కృష్ణ.