super star krishna remake movies record
mictv telugu

రీమేక్ చిత్రాల రికార్డు కృష్ణదే..

November 15, 2022

పొరుగుభాషల్లో హిట్ అయినా సినిమాలను టాలీవుడ్‌లో రీమేక్ చేయడం ఈ మధ్య చూస్తున్నాం. ఎంతటి పెద్ద హీరో అయినా సినిమా నచ్చితే రీమేక్‌లు చేసేస్తున్నారు. కొత్త కథలతో రిస్క్ చేయకుండా హిట్ స్టోరీస్‌ని అటు..ఇటు మార్చి తెరకెక్కిస్తున్నారు. ఇలాంటి రీమేక్‌లకు సూపర్ స్టార్ కృష్ణ ఆద్యుడనే చెప్పాలి. తెలుగులో ఎక్కువ రీమేక్ చిత్రాల్లో నటించి రికార్డు సృష్టించారు. ఆయన మొత్తం 54 రీమేక్ చిత్రాలు చేసి ట్రెండ్ సెట్ చేశారు. ఇందులో హిందీ రీమేక్‌ చిత్రాలు 17 ఉన్నాయి.

బాలీవుడ్‌ నటుడు, నిర్మాత, దర్శకుడు రాజ్‌ కపూర్‌ నటించిన ‘అనాడి’ ఆధారంగా రూపుదిద్దుకున్న ‘అమాయకుడు’ చిత్రంలో హీరో కృష్ణ నటించారు. హిందీలో విజయం సాధించిన ‘వక్‌ త్‌’ ఆధారంగా రూపుదిద్దుకున్న ‘భలే అబ్బాయిలు’ చిత్రంలో కృష్ణ, కృష్ణంరాజు, రామ్మోహన్‌ హీరోలుగా నటించారు. ‘శభాష్‌ సత్యం, ‘నేనూ మనిషినే’ ‘గూడు పూటానీ’ ‘మనుషులు చేసిన దొంగలు’. ‘ముగ్గురూ ముగ్గురే’, ‘దొంగల వేట’ వంటి రీమేక్ చిత్రాల్లో కృష్ణ నటించి అలరించారు.సూపర్ స్టార్ కృష్ణ కూడా బిగ్‌బీ నటించిన పలు సూపర్ హిట్ చిత్రాలను తెలుగులో రీమేక్ చేసారు.

super star krishna remake  movies record

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ కృష్ణది ప్రత్యేక అధ్యాయం. ఆయన తన కెరీర్‌లో ఎన్నో రికార్డులు, మైలురాళ్లను అందుకున్నారు. సుమారు 350 పైగా సినిమాలలో నటించిన మొదటి కథానాయకుడు కృష్ణ. తెలుగులో తొలి జేమ్స్ బాండ్ సినిమా చేసింది ఆయనే. విజయవాడలో 1983లో ఆయన నటించిన ఆరు సినిమాలు వంద రోజులు ఆడాయి. ఎక్కువ మల్టీస్టారర్ సినిమాలు కృష్ణేనే చేశారు. కెరీర్ మొత్తంలో 50 మల్టీస్టారర్స్‌లో నటించారు. కృష్ణను సంక్రాంతి హీరో అని కూడా పిలిచేవారు. హీరోగా 44 ఏళ్లు పాటు సినిమాలు చేస్తే..అందులో 30 ఏళ్లు సంక్రాంతికి ఆయన సినిమాలు విడుదలయ్యాయి. తన కెరీర్‌లో మొత్తం 105 మంది దర్శకులతో కలిసి పనిచేశారు.