Super Star Krishna's health condition remains critical: Doctors
mictv telugu

48 గంటలు గడిస్తేనే కానీ చెప్పలేం..

November 14, 2022

Super Star Krishna's health condition remains critical: Doctors

సూపర్ స్టార్ కృష్ణ తీవ్ర అస్వస్థతకు గురయ్యారని, దీంతో ఆయన్ను గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతుండగా.. నటుడు నరేశ్ ప్రస్తుతం ఆయన బాగానే ఉన్నట్లు, సాయంత్రంలోగా డిశ్చార్జ్ అవుతారని సర్దిచెప్పారు. కానీ తాజాగా హాస్పిటల్ డాక్టర్లు విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో మాత్రం కృష్ణ పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని పేర్కొన్నారు. ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు.

‘‘కార్డియాక్‌ ఆరెస్టుతో కృష్ణను ఆస్పత్రికి తీసుకొచ్చారు. కార్డియాలజిస్టుల బృందం ప్రత్యేక పర్యవేక్షణ చేస్తోంది. కృష్ణకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్నాం. 48 గంటల వరకు ఏమీ చెప్పలేం. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్‌పై ఉన్నారు. ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. రేపు మధ్యాహ్నం ఒంటిగంటకు మరోసారి హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేస్తాం’’ అని డాక్టర్లు తెలిపారు. రాత్రి 2 గంటలకు కార్డియాక్ అరెస్ట్ తో కృష్ణ ఆస్పత్రికి వచ్చారన్నారు.20 నిమిషాల పాటు సీపీఆర్ నిర్వహించినట్లు వెల్లడించారు. ఈ మధ్యే కృష్ణ భార్య ఇందిరాదేవి మరణించిన సంగతి తెలిసిందే. భార్య మరణంతో ఆయన కుంగిపోయారు. దీంతో ఆయన ఆరోగ్యం క్షీణించినట్లుగా కుటుంబసభ్యులు తెలిపారు. ఇప్పటికే ఆయన కుమారుడు, ప్రముఖ హీరో మహేశ్ బాబు హాస్పిటల్‌కు చేరుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.