మహేష్ బాబు మానవత్వం..మరో చిన్నారికి గుండె ఆపరేషన్ - MicTv.in - Telugu News
mictv telugu

మహేష్ బాబు మానవత్వం..మరో చిన్నారికి గుండె ఆపరేషన్

October 18, 2019

నటుడు మహేష్ బాబు సినిమాల్లోనే కాదు.. బయట కూడా సూపర్ స్టార్ అనిపించుకుంటున్నాడు. మహేష్ బాబు గత కొన్నేళ్లుగా ఎన్నో మంచి పనులు చేస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్న సంగతి తెలిసిందే. తెలంగాణ, ఏపీలో రెండు గ్రామాలను దత్తద తీసుకొని అభివృద్ధి చేయిస్తున్న సంగతి తెల్సిందే. 

mahesh babu.

అలాగే పేద పిల్లలకు ఉచితంగా గుండె ఆపరేషన్లు చేయిస్తున్నాడు. ఇప్పటి వరకు దాదాపు వెయ్యి మంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించిన మహేష్ బాబు, తాజాగా మరో చిన్నారికి గుండె ఆపరేషన్ చేయించాడు. ఇక సినిమాల విషయానికి వస్తే మహేష్ బాబు ప్రస్తుతం తన 26వ సినిమా ‘సరిలేరు నీకెవ్వరూ’ చిత్రీకరణలో బిజీలో ఉన్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతున్నది.