ఢిల్లీ హింసాకాండపై సూపర్ స్టార్ రజినీ ఆగ్రహం - MicTv.in - Telugu News
mictv telugu

ఢిల్లీ హింసాకాండపై సూపర్ స్టార్ రజినీ ఆగ్రహం

February 27, 2020

mhncfnh

ఢిల్లీ హింసాకాండలో మరణించిన వారి సంఖ్య 27కు చేరుకుంది. ఢిల్లీ హింసపై సూపర్ స్టార్ రజినీకాంత్ ఘాటుగా స్పందించారు. ఢిల్లీలో రోజు రోజుకు హింసాత్మక రూపంలోకి మారుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది.. ఇది ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ వైఫల్యం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి హింసను ఉక్కు పిడికిలితో అణచివేయాలి. అలా చేయడం రాకపోతే ప్రభుత్వం రాజీనామా చేయాలి.

అయితే కొన్ని రోజుల క్రితం రజినీ మీడియా ముందుకు వచ్చి.. కేంద్రం తీసుకొచ్చిన సీఏఏ వల్ల ముస్లింలకు ఎలాంటి ముప్పు లేదని తెలిపిన సంగతి తెల్సిందే. ఒకవేళ అలాంటిది ఏదైనా జరిగితే వారి తరఫున పోరాడే మొదటి వ్యక్తిని తానే అవతానని హామీ ఇచ్చారు. విభజన తర్వాత భారత్‌లోనే ఉండిపోవాలని నిశ్చయించుకున్న ముస్లింలను దేశం నుంచి పంపిస్తారని ఎలా అనుకుంటున్నారు? సీఏఏతో భారత పౌరులకు ఎలాంటి సమస్యలు ఉండవని ప్రభుత్వం కూడా హామీ ఇచ్చిందని రజినీ చెప్పుకొచ్చారు. అలాగే కొన్ని పార్టీలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజలను రెచ్చగొడుతున్నాయని ప్రతిపక్షాలను ఎద్దేవా చేశారు. అలాగే బయటి వ్యక్తులను గుర్తించేందుకు ఎన్‌పీఆర్ చాలా ముఖ్యమైనదని రజినీ తెలిపారు. దేశవ్యాప్త ఆందోళనలకు కారణమైన పౌరసత్వ సవరణ చట్టంపై రజనీ మీడియాతో స్పందించడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. గత డిసెంబరులో సీఏఏపై పరోక్షంగా స్పందించిన రజనీ.. దేశంలో చోటుచేసుకున్న హింసాత్మక ఆందోళనలపై విచారం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.