రాజకీయాల్లో వస్తానని సూపర్ స్టార్ రజనీకాంత్ మరోమారు సూచనప్రాయంగా తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ నేను ఏం చెప్పాలనుకుంటున్నానో అది నిన్నే అభిమానులకు చెప్పాను. ఇక ఇప్పుడు చెప్పేందుకు ఏమీలేదు. నా అభిమానులను కలుసుకొని సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటాను’ అని రజనీ చెప్పారు.
2009 తర్వాత రజనీకాంత్ తొలిసారిగా అభిమానులతో సమావేశమవుతున్నారు. రజనీ స్పెషల్ దర్బార్లో మూడో రోజు భేటిలో అభిమానులు ఆయనతో ఫొటోలు దిగేందుకు పోటీపడ్డారు. తరచూ తన మనసు మారిపోతుందని మీడియా చేస్తున్న వ్యాఖ్యలను రజనీ తోసిపుచ్చారు. తాను ఏ విషయాన్నైనా స్పష్టంగా ఆలోచిస్తానని బలంగా నిర్ణయాలు తీసుకుంటానని స్పష్టం చేశారు.
అభిమానులను కలుసుకునేందుకు ఎనిమిదేళ్లకు పైగా సమయం పట్టడానికి రజనీ కారణాలు చెప్పారు. ‘ఎంథిరన్’ తర్వాత వచ్చిన చిత్రాలు నిరాశపర్చడంతో అభిమానుల మందుకు రాలేకపోయినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ‘2.0’ సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా 2018 జనవరిలో విడుదల కానుంది.
HACK:
- Super Star Rajinikanth hints about his political Entry.