ఆహో.. ఒహో..ధోనీ స్టంపింగ్..సూపర్..!
స్టంప్స్ వెనకాల ధోనీని మించిన మొనగాడు లేడు. వికెట్ల వెనక అతను ఉన్నాడంటే ఎంతటి విధ్వంసకర బ్యాట్స్‌మన్ అయినా క్రీజులోంచి ముందుకొచ్చి ఆడాడు. ఒకవేల వచ్చాడంటే..బాల్ మిస్సయిందంటే..ఆ బ్యాట్స్ మెన్ ఖేల్ ఖతమే…
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా లండన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ధోనీ మళ్లీ స్టంపింగ్ స్పెషాలిటీ ఫ్రూవ్ చేశాడు. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ 110 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. అప్పుడు క్రీజులోకి వచ్చిన గ్రాండ్‌హోమ్ నాలుగు పరుగులు చేశాడు. స్కోర్ బోర్డు వేగం పెంచాలని జడేజా వేసిన బంతిని ముందుకొచ్చి ఆడాడు. అంతే.. బంతి బ్యాటును తాకకుండా ధోనీ చేతికి చిక్కింది. ఇంకేముంది క్షణాల వ్యవధిలోనే అతడు వికెట్లను కొట్టేసిగ్రాండ్‌హోమ్‌ను పెవిలియన్‌కు పంపించాడు. ధోనీ స్టంపింగ్ సూపర్ అంటూ ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తున్నారు.
#MSDHONI STUMPING TODAY WARMUP MATCH pic.twitter.com/H3S8olx4nw
— CEO Virat Karthi (@CEO_RainaKarthi) May 28, 2017