Superstar Krishna passes away.. Tollywood in mourning
mictv telugu

సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూత.. శోకసంద్రంలో టాలీవుడ్

November 15, 2022

తెలుగు చలన చిత్రసీమలో తనకంటూ ప్రత్యేకతను చాటుకున్న సూపర్ స్టార్ కృష్ణ(79) ఇక లేరు. ఇవాళ తెల్లవారు జామున హైదరాబాద్ లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో ఆయన కన్నుమూశారు. ఆదివారం రాత్రి గుండెపోటుతో గచ్చిబౌలిలో కాంటినెంటల్ ఆసుపత్రిలో చేరారు కృష్ణ.. చికిత్స పొందుతూ తెల్లవారుజామున ఉదయం 4 గంటలకు తుదిశ్వాస విడిచారు కృష్ణ. కార్డియాక్ అరెస్ట్ కారణంగా బ్రెయిన్‌తో పాటు కిడ్నీ, లంగ్స్ ఎఫెక్ట్ అయినట్టు డాక్టర్లు తెలిపారు.

ఈ ఏడాదిలోనే కృష్ణ  భార్య ఇందిరా దేవి, పెద్దకుమారుడు రమేష్ బాబు అకస్మాత్తుగా మరణించారు. ఆ మరణాలతో తీవ్రంగా కృంగిపోయిన కృష్ణ అనారోగ్యం పాలయ్యారు. ఈ క్రమంలోనే ఆయన ఆరోగ్యం క్షీణించింది.  కృష్ణ మరణవార్తతో టాలీవుడ్ చిత్ర పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. సినీ పెద్దలు దిగ్భ్రాంతికి గురైయ్యారు. ధైర్యంగా ఉండాలంటూ కుమారుడుకు మహేష్ బాబుకు ప్రగాడ సానుభూతి తెలుపుతున్నారు. అభిమానులు కూడా కన్నీరు పెట్టుకుంటున్నారు.