సూపర్ స్టార్ మహేశ్ బాబు సర్కారువారి పాట ఫిల్మ్ విజయవంతం కావడంతో విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో మహేశ్ నటించనున్న తరువాత చిత్రం కోసం మూవీ మేకర్ ప్లాన్ చేస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో మహేశ్ బాబు మూడో మూవీ చేయనున్నారు. ఇప్పటికే త్రివిక్రమ్ కాంబినేషన్ లో అతడు, ఖలేజా వంటి సినిమాల్లో నటించిన మహేశ్ బాబు ఇప్పుడు వీరి కాంబోలో వస్తున్న SSMB28పై భారీ అంచనాలు మొదలయ్యాయి. ఈ మూవీలో మహేశ్ బాబు డ్యూయల్ రోల్లో నటిస్తున్నట్లు సోషల్ మీడియాలో గాసిప్స్ వస్తున్నాయి. ఇందులో హీరోయిన్ గా టాలీవుడ్ బుట్టబొమ్మ పూజాహెగ్డేతోపాటు శ్రీలీల కూడా నటిస్తోంది.
📸🔥🔥🔥 pic.twitter.com/hb4XrTgkem
— 𝐁𝐡𝐞𝐞𝐬𝐡𝐦𝐚 𝐓𝐚𝐥𝐤𝐬 (@BheeshmaTalks) March 2, 2023
కాగా ఈ సినిమా భారీ యాక్షన్ సీన్స్ ను త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నారట. అయితే ఈ మూవీ కోసం మహేశ్ బాగా హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మహేశ్ బాబుకు జిమ్ లో కసరత్తు చేసున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మహేశ్ బాబుకు తన ఇంట్లోనే జిమ్ ఉంది. ఇక మహేశ్ బాబు లుక్ చూసిన నెటిజన్లు గార్జియస్ బాయ్, టీనేజర్ బాయ్, హ్యాండ్సమ్ హంక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.