Superstar Rajinikanth gets yet another prestigious award
mictv telugu

సూపర్ స్టార్ రజనీకాంత్‌కు మరో ప్రతిష్టాత్మక అవార్డు

July 24, 2022

సూపర్ స్టార్ రజినీకాంత్ కు అరుదైన గౌరవం దక్కింది. తమిళనాడులో అత్యధికంగా ఇన్‌కమ్ ట్యాక్స్ (ఆదాయపు పన్ను)ను చెల్లిస్తున్నందుకుగాను.. ఐటీ శాఖ ప్రతిష్ఠాత్మక అవార్డును రజనీకి ప్రదానం చేసింది. చెన్నైలో జరిగిన ఇన్‌కమ్ ట్యాక్స్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ అవార్డును బహుకరించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

అయితే, ఈ కార్యక్రమానికి రజినీకాంత్ హాజరుకాలేదు. ఆయన స్థానంలో పెద్ద కూతురు ఐశ్వర్య ఈ అవార్డును స్వీకరించారు. ముఖ్యఅతిథిగా హాజరైన తమిళసై మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిరంతర కృషి వల్లే ప్రజలు పన్నులు కట్టేందుకు ముందుకు వస్తున్నారని తెలిపారు. ప్రతిఒక్కరూ ప్రభుత్వానికి పన్నులు చెల్లించాలని కోరారు.