కళాకారుడు ప్రణవ్‌ కాలితో రజినీ కరచాలనం - MicTv.in - Telugu News
mictv telugu

కళాకారుడు ప్రణవ్‌ కాలితో రజినీ కరచాలనం

December 3, 2019

Superstar Rajinikanth’s

కేరళలోని పాలఘాట్‌కు చెందిన ప్రణవ్ ఎంబి పుట్టుకతోనే వికలాంగుడు. పుట్టుకతో రెండు చేతులు లేవు. అయినా కూడా దృఢ సంకల్పంతో ప్రయత్నించి కాళ్లతో పెయింటింగ్ వేయడం నేర్చుకున్నాడు. 21 ఏళ్ల ప్రణవ్ అద్భుతంగా పెయింటింగ్ వేయగలడు. 

Superstar Rajinikanth’s

తన పెయింటింగ్‌లు అమ్మడం ద్వారా వచ్చిన డబ్బుని కేరళలో వరదలు సంభవించిన సమయంలో సీఎం రిలీఫ్ ఫండ్‌కి విరాళంగా ఇచ్చాడు. దీంతో సీఎం పునరాయి విజయన్ నుంచి పిలుపు వచ్చింది. సీఎం విజయన్.. ప్రణవ్ కాలితో షేక్ హ్యాండ్ తీసుకొని సెల్ఫీ దిగాడు. దీంతో ప్రణవ్ పేరు మీడియాలో మారుమోగిపోతోంది.

 

Superstar Rajinikanth’s

తాజాగా ప్రణవ్‌కు సూపర్ స్టార్ రజినీకాంత్ నుంచి పిలుపు వచ్చింది. ప్రణవ్‌ను పోయెస్ గార్డెన్‌లోని తన ఇంటికి రజినీ ఆహ్వానించారు. కేరళ నుంచి చెన్నై రావడానికి ప్రణవ్ కుటుంబానికి రజినీనే ఏర్పాట్లు చేశారు. సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌ని క‌లిసి ఆయ‌న‌కి త‌ను వేసిన స్కెచ్‌ని బ‌హుమ‌తిగా వ‌చ్చాడు. 

Superstar Rajinikanth’s

ఇది చూసిన ర‌జ‌నీకాంత్ చాలా సంతోషించి ప్రణవ్‌తో కాసేపు స‌ర‌దా ముచ్చటించాడు. ప్రస్తుతం ర‌జ‌నీకాంత్‌, ప్రణవ్ క‌లిసి దిగిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రణవ్ ఇదివరకు కూడా పలువురు సెలబ్రిటీలను కలిశాడు. మాజీ క్రికెటర్ సచిల్ టెండూల్కర్ చిత్రాన్ని గీసి కానుకగా అందించాడు.