సహాయ నటిపై కెమెరా మెన్.. అరెస్ట్ - MicTv.in - Telugu News
mictv telugu

సహాయ నటిపై కెమెరా మెన్.. అరెస్ట్

June 14, 2022

తమిళ సినీ ఇండస్ట్రీలో మరో అత్యాచార ఘటన వెలుగు చూసింది. ఫోటో షూట్ పేరుతో సహాయ నటిపై కెమెరామెన్ అత్యాచార యత్నం చేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు కెమెరామెన్‌ను అరెస్ట్ చేశారు. చెన్నైలోని కొడుంగయూరు ప్రాంతంలో నివసించే 22 ఏళ్ళ సహాయ నటి పలు సీరియళ్లలో నటిస్తుండేది. దీంతో పాటు సినిమాల్లో నటించాలని ఆమెకు కోరిక ఉండేది. అయితే అవకాశాలు రావాలంటే ప్రత్యేకంగా ఫోటో షూట్ చేయించాల్సి రావడంతో ఓం శక్తి నగర్‌కు చెందిన కెమెరామెన్ ‌కాశీనాథన్‌ను సంప్రదించింది. అతను తనకు చాలా పెద్ద డైరెక్టర్లు తెలుసు, తప్పకుండా హీరోయిన్‌గా చేస్తానని నమ్మబలికి అందుకోసం ఫోటోషూట్ అవసరం ఉందంటూ ఇంటికి పిలిపించాడు. హీరోయిన్ అవ్వాలన్న ఆశలో ఉన్న యువతి కాశీనాథన్ మాటలను నమ్మి ఇంటికి వెళ్లగా, అప్పటికే మద్యం మత్తులో ఉన్న కాశీనాథన్ ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించాడు. దీంతో షాక్ అయిన సహాయ నటి అతడి నుంచి ఎలాగోలా తప్పించుకొని వలసరవాక్కం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కాశీనాథన్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.