సుప్రీం చీఫ్ జస్టిస్‌ ప్రాణాలకు ముప్పు.. జడ్ ప్లస్ సెక్యూరిటీ  - MicTv.in - Telugu News
mictv telugu

సుప్రీం చీఫ్ జస్టిస్‌ ప్రాణాలకు ముప్పు.. జడ్ ప్లస్ సెక్యూరిటీ 

July 30, 2020

Supreme Chief Justice sa bobde ‌Threat to life .. Z plus security

సుప్రీం చీఫ్ జస్టిస్​ ఎస్​ఏ బోబ్డే(64) ప్రాణాలను ముప్పు పొంచి ఉందని నిఘా వర్గాలు హెచ్చరికలు జారీచేశాయి. ఈ క్రమంలో అప్రమత్తమైన కేంద్రం ఆయన భద్రతను జెడ్​ నుంచి జెడ్​ ప్లస్​కు మార్చింది. వివాదాస్పద రామ జన్మభూమి – బాబ్రీ మసీదు కేసులో కీలక తీర్పు వెలువరించిన ఐదురుగు సభ్యుల ధర్మాసనంలో ఆయన ఓ సభ్యుడిగా ఉన్నారు. ప్రస్తుతం భారత ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. ఇప్పటివరకు భారత ప్రధాన న్యాయమూర్తికి జెడ్​ కేటగిరీ భద్రత ఉండేది. భద్రతా కారణాల రీత్యా ఆయనకు జెడ్​ ప్లస్​ కేటగిరికి మార్చుతూ కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఆదేశించింది. ఇకపై జస్టిస్​ బోబ్డే సీఆర్​పీఎఫ్​, సీఏపీఎఫ్​ బలగాలు భద్రతలో ఉండనున్నారు. 

కాగా, 2019 నవంబర్​ 18న భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్​ బోబ్డే బాధ్యతలు స్వీకరించారు. ఆగస్టు 5వ తేదీన అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా దాడి చేయడానికి పాకిస్థాన్ ఎస్ఐఎస్ ప్రేరేపిత ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది.