అబార్షన్ ఆడవారి హక్కు - MicTv.in - Telugu News
mictv telugu

అబార్షన్ ఆడవారి హక్కు

October 28, 2017

మహళలు గర్భస్రావం చేయించుకోవడానికి భర్త సహా ఎవరి నుంచీ అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. తనకు తెలియకుండా తన భార్య అబార్షన్ చేయించుకుందని, దీనికి ఆమె తల్లిదండ్రులు, డాక్టర్ల నుంచి పరిహారం ఇప్పించాలని ఓ వ్యక్తి పంజాబ్-హరియాణా హైకోర్టులో పిటిషన్ వేశాడు.

అయితే అబార్షన్ అనేది ఆడవారి ఏకైక అధికారం అంటూ హైకోర్టు ఆ పిటిషన్‌ను తోసిపుచ్చింది. దీంతో ఆ వ్యక్తి సుప్రీంకోర్టులో అప్పీలు చేశాడు. భార్యభర్తల మధ్య ప్రస్తుతం సంబంధాలు బాగా లేనందున గర్భాన్ని తీయించుకోవాలన్న నిర్ణయం సరైనదే అని సుప్రీం చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్  ఏ.ఎమ్. ఖన్విల్ కర్, జస్టిస్ డి.వై. చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్ పేర్కొంటూ, అప్పీలును  తిరస్కరించింది. వాళ్లిద్దరి మధ్య సంబంధం లేకపోవడానికి అబార్షన్ కారణం కానందున, భర్త చెపుతున్న కారణాలను పరిగణలోకి తీసుకోలేమంటూ హైకోర్టు తీర్పును సమర్థించింది. ఆమె ఒక బిడ్డ తల్లి. ఆమెకు పిల్లల్ని కనడం ఇష్టం లేదని ఎలా చెప్పగలం? దానికి ఎవర్ని బాధ్యుల్ని చేస్తారు? ఆమె అబార్షన్ చేయించుకుంటే తల్లిదండ్రులు, డాక్టర్లను బాధ్యులుగా ఎలా చూస్తాం? మానసిక స్థితి సరిగా లేని స్త్రీకి కూడా అబార్షన్ చేయించుకునే హక్కు ఉంది” అని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.