బాంబులేసి ఢిల్లీ ప్రజలను చంపేయండి..సుప్రీం కోర్టు - MicTv.in - Telugu News
mictv telugu

బాంబులేసి ఢిల్లీ ప్రజలను చంపేయండి..సుప్రీం కోర్టు

November 25, 2019

Supreme court about delhi air pollution

“15 సంచుల్లో పేలుడు పదార్థాలు తీసుకువచ్చి ఢిల్లీ ప్రజలందరినీ ఒకేసారి చంపేయండి” ఈ మాటలు వినగానే ఏ ఉగ్ర సంస్థ నాయకుడు చేసినవిగా అనిపిస్తాయి. కానీ, వాయు కాలుష్యాన్ని ఉద్దేశింది దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలివి. పంజాబ్, హరియాణా, ఢిల్లీ, కేంద్ర ప్రభుత్వాలు కాలుష్యంపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీ రాజధాని ప్రాంతములో నెలకొన్న కాలుష్యంపై జస్టిస్ దీపక్ గుప్తా, అరుణ్ మిశ్రాలకు చెందిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఢిల్లీ కాలుష్య తీవ్రత గురించి సుప్రీంకోర్టు ప్రస్తావించింది. ప్రజలను గ్యాస్ చాంబర్‌లోకి ఎందుకు బలవంతంగా నెడుతున్నారని కేంద్రాన్ని ప్రశ్నించింది. ఒకేసారి చంపేస్తే రోజు నరకయాతన ఉండదు కదా అని ఆగ్రహం వ్యక్తం చేసింది. 

ఇప్పటికే కాలుష్యంతో ఢిల్లీ ప్రజల ఆయుష్షు తగ్గిపోతోందని వ్యాఖ్యానించింది. ప్రజలు కాలుష్యం బారిన పడి చనిపోతుంటే చూస్తూ ఊరుకుంటారా అని ప్రశ్నించింది. ఈ సందర్భంగా ఢిల్లీ సరిహద్దు రాష్ట్రమైన పంజాబ్ చీఫ్ సెక్రటరీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కాలుష్యం నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోలేకపోతున్నందుకు ఆ రాష్ట్రంపై జరిమానా ఎందుకు విధించకూడదని ప్రశ్నించింది. అలాగే హర్యానా రాష్ట్ర చీఫ్ సెక్రటరీపై కూడా మండిపడింది. కాలుష్యంను నియంత్రించకపోతే భవిష్యత్తు తరాలు చాలా ఇబ్బంది పడుతాయని పేర్కొంది. ప్రజల బాగోగులను పట్టించుకోకపోతే చీఫ్ సెక్రటరీలుగా కొనసాగేందుకు అనర్హులు అవుతారని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఢిల్లీలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ మధ్య ఉన్న రాజకీయ విబేధాలను పక్కనబెట్టి కాలుష్యం నియంత్రణకు 10 రోజుల్లోగా ఒక శాశ్వతమైన ప్రణాళిక తయారు చేయాలని ఆదేశాలు జారీచేసింది. కాలుష్యం వలన జరిగిన నష్టానికి ప్రభుత్వాలు ఇచ్చే పరిహారం బాధితులకు సరిపోదని వ్యాఖ్యానిస్తూ.. భోపాల్ గ్యాస్ విషాదాన్ని గుర్తుచేసింది.