supreme court adjourned the bail petition of the accused in the mla purchase case to monday
mictv telugu

ఫామ్‌హౌస్ ఎమ్మెల్యేల కేసు: నిందితుల బెయిల్ పిటిషన్ వాయిదా

November 14, 2022

తెలంగాణలో సంచలనంగా మారిన‌ ఫామ్ హౌజ్ ప్రలోభాల కేసుపై ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ జ‌రిగింది. హైకోర్టు రిమాండ్‌ను సవాల్ చేస్తూ ముగ్గురు నిందితులు సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని ఆశ్రయించారు. బెయిల్ పిటిషన్ పై ఏసీబీ కోర్టు సాయంత్రం ఉత్తర్వులు ఇవ్వనున్నందున విచారణను వాయిదా వేయాలని నిందితుల తరపు న్యాయవాది ధర్మసనాన్ని కోరారు. విచారణను శుక్రవారానికి వాయిదా వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దీనిని పరిశీలించిన జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విక్రమ్ నాథ్లతో కూడిన ధర్మాసనం తదుపరి విచారణను ఈనెల 21వ‌ తేదీకి వాయిదా వేసింది.

మరోవైపు ఈ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్‌ వరుస దాడులు నిర్వహిస్తోంది. నిందితులు రామచంద్రభారతి, సింహయాజి, నందకుమార్‌కి చెందిన ఇళ్లు, కార్యాలయాలు, వ్యాపార సంస్థలు, ఆశ్రమాల్లో రెండురోజులుగా తనిఖీలు కొనసాగాయి. శనివారం మొదలైన సోదాలు ఆదివారం రాత్రి వరకు జరిగాయి. తనిఖీల కోసం ఇందుకోసం 7 బృందాలను ఏర్పాటు చేశారు. తెలుగురాష్ట్రాలతో పాటు కేరళ, కర్ణాటక, హరియాణాలోనూ తనిఖీలు నిర్వహించాయి. హైదరాబాద్‌లో నందకుమార్ ఇళ్లలో సోదాలు చేపట్టగా..తిరుపతిలోని సింహయాజి ఆశ్రమంలో సిట్ తనిఖీలు చేశారు. ఇక హర్యానా, కర్ణాటకలో రామ చంద్ర భారతి ఇళ్లలోనూ రైడ్స్ జరిగాయి. అలాగే కేరళలో ఓ డాక్టర్ ఇంట్లో కూడా సోదాలు చేపట్టారు. ఈ డాక్టర్ రామచంద్రభారతికి మధ్యవర్తిత్వంగా ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం డాక్టర్ కూడా పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది.