Supreme Court allowed termination of pregnancy at 24 weeks
mictv telugu

పెళ్లికాని యువతికి 24 వారాల గర్భం.. హైకోర్టు నో.. సుప్రీం ఓకే

July 21, 2022

Supreme Court allowed termination of pregnancy at 24 weeks

అవివాహిత యువతి గర్భంపై సుప్రీంకోర్టు గురువారం కీలక తీర్పు వెల్లడించింది. 24 వారాల గర్భాన్ని తొలగించుకునేందుకు అనుమతినిచ్చింది. ఈ మేరకు 2021లో సవరించిన చట్టాన్ని ప్రస్తావించింది. అంతకు ముందు ఢిల్లీ హైకోర్టు యువతి పిటిషన్‌ను కొట్టివేసింది. దాంతో ఆమె సుప్రీంకి వెళ్లగా, పెళ్లికాని యువతులకు కూడా అబార్షన్ చేయించుకోవచ్చని స్పష్టం చేసింది.

ఢిల్లీకి చెందిన యువతి వయసు 25 ఏళ్లు కాగా, కొంతకాలం ఓ యువకుడితో సహజీవనం చేసి గర్భం దాల్చింది. తర్వాత ఆ యువకుడు పెళ్లికి నిరాకరించడంతో గర్భాన్ని తీసేయాలని నిర్ణయించి, అనుమతి కోసం కోర్టుకు వెళ్లింది. హైకోర్టును దాటి సుప్రీంకోర్టుకు వెళ్లగా, కోర్టు ఎయిమ్స్ వైద్యుల మెడికల్ బోర్డు సలహా అడిగింది. అబార్షన్ చేసినా యువతి ప్రాణాలకు ఎలాంటి హాని కలుగదని వారు క్లియరెన్స్ ఇవ్వడంతో సుప్రీంకోర్టు ఆ మేరకు తీర్పునిచ్చింది.