సుప్రీంకోర్టు బెంచీ నుంచి ఇక ప్రత్యక్ష ప్రసారాలు - MicTv.in - Telugu News
mictv telugu

సుప్రీంకోర్టు బెంచీ నుంచి ఇక ప్రత్యక్ష ప్రసారాలు

September 26, 2018

ఇది ఫోన్ల కాలం. రొమాన్స్ దగ్గర్నుంచి హత్యల వరకు అన్నీ ప్రత్యక్షంగా ప్రసారమైపోతున్నాయి.  ప్రసార మాధ్యమాలు కూడా పెరిగిపోవడంతో లైవ్ ప్రసారాలు ఊపందుకున్నాయి. సోషల్ మీడియాలో కూడా ఫేస్‌బుక్ లైవ్ అని, ఇన్‌స్టాగ్రామ్ లైవ్ అని ఇలా ఆప్షన్లు చాలా పెరిగాయి. ఈ క్రమంలో సుప్రీంకోర్టు కూడా లైవ్ టెలికాస్ట్‌కు అంగీకారం తెలిపింది.

rr

కీలక రాజ్యాంగపరమైన కేసులను విచారించే సమయంలో దాపరికం లేకుండా  ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు కోర్టు పూనుకుంది. సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్‌ను వేశాడు. రాజ్యాంగపరమైన, జాతీయ స్థాయిలో ముఖ్యమైన కేసులు ప్రజలపై ప్రభావం చూపుతాయి. వాటిని ప్రత్యక్ష ప్రసారం చేయాలని  సుప్రీంకోర్టును కోరాడు. ‘రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఎ) ప్రకారం సుప్రీంకోర్టు విచారణలు, ప్రత్యక్ష ప్రసారం, సమాచారం పొందడం ప్రజల ప్రాథమిక హక్కు’ అని తెలిపాడు. ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు అనుమతిని ఇస్తూ తీర్పు వెలువరించింది. ‘సుప్రీంకోర్టు నుంచే ప్రత్యక్ష ప్రసారాలను ప్రారంభిస్తాం. దీనికోసం నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ప్రత్యక్ష ప్రసారాల ద్వారా న్యాయ వ్యవస్థలో జవాబుదారీతనాన్ని తీసుకొస్తుంది’ అంటూ భారత ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎమ్ ఖాన్విల్కర్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది.‘ప్రత్యక్ష ప్రసారం వల్ల కోర్టు విచారణపై మరింత స్పష్టత వస్తుంది. అదే సమయంలో కేసుల్లో కూడా మరింత పారదర్శకత వస్తుంది’ అని  జస్టిస్ డీవై చంద్రచూడ్ వ్యాఖ్యానించారు.