జగన్ సర్కారుకు సుప్రీం షాక్.. సహకరించిన కేంద్రం - MicTv.in - Telugu News
mictv telugu

జగన్ సర్కారుకు సుప్రీం షాక్.. సహకరించిన కేంద్రం

April 13, 2022

jagannn

ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాకిచ్చింది. నిధుల వినియోగానికి సంబంధించి నిర్దేశించిన పనులకే వాడాలని స్పష్టం చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు బుధవారం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. వివరాలు.. ఏపీలో స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్డీఆర్ఎఫ్)కు కేటాయించిన నిధులను పీడీ ఖాతాలకు ప్రభుత్వం దారి మళ్లించింది. ఈ విషయంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను బుధవారం నాడు విచారించగా.. విచారణలో భాగంగా సుప్రీంకోర్టు కేంద్రం అభిప్రాయాలను అడిగింది. దీనిపై కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ మండిపడుతూ తన వైఖరిని కోర్టు ముందుంచింది. కేంద్ర వాదనను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు ఏపీ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. మీరు తీసుకున్న నిర్ణయం సరైంది కాదని, నిధుల దారి మళ్లింపు కుదరదని కరాఖండీగా చెప్పింది. అంతేకాక, ప్రభుత్వ నిర్ణయంపై స్టే విధిస్తూ.. తదుపరి విచారణను ఈ నెల 28వ తేదీకి వాయిదా వేసింది.