రాహుల్ గాంధీకి సుప్రీం కోర్టు నోటీసులు - MicTv.in - Telugu News
mictv telugu

రాహుల్ గాంధీకి సుప్రీం కోర్టు నోటీసులు

April 15, 2019

అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి సుప్రీం కోర్టు నోటీసులు జారీచేసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాన మంత్రి మోదీని ‘చౌకీదార్‌ చోర్‌ హై’ అంటూ చేసిన వ్యాఖ్యాలపై ఈనెల 22 లోపు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. రాహుల్‌ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీజేపీ నేత మీనాక్షి లేఖి సుప్రీం కోర్టులో వేసిన పిటీషన్‌పై సోమవారం విచారణ జరిగింది. మీడియాతో, బహిరంగ సభల్లో ప్రధాని మోదీని చౌకీదార్‌ చోర్‌ హై అంటూ రాహుల్‌ అనడంపై ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

Supreme Court Asks Rahul Gandhi To Explain Rafale Comments.

రాహుల్‌ గాంధీ చేసినట్లుగా చెబుతున్న వ్యాఖ్యలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ స్పందిస్తూ.. రాఫైల్‌ తీర్పుపై ఇలాంటి వ్యాఖ్యలు సరికాదని పేర్కొన్నారు. తాము కేవలం కేసు విచారణ సందర్భంగా వివాదాస్పద పత్రాలు పరిగణనలోకి తీసుకోవాలా? వద్దా? అన్న అంశంపై మాత్రం తమ అభిప్రాయం చెప్పామని తెలిపారు. ఈలోగా సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ రాఫైల్‌ కేసు తదుపరి విచారణ విషయం గుర్తు చేశారు. ‘మర్చిపోయాను… త్వరలోనే తేదీ ప్రకటిస్తాన’ని గొగోయ్ తెలిపారు.