సుప్రీం కోర్టు మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో కాలుష్య ఉద్గారాలను నియంత్రించడంలో భాగంగా కేంద్రం తీసుకుంటున్న చర్యలకు మద్దతు తెలిపింది. భారత్ స్టేజ్(BS)4 వాహనాలను 2020 ఏప్రిల్ 1వ తేదీ తర్వాత అమ్మొద్దని, రిజిస్ట్రేషన్ కూడా చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది.
2017 ఏప్రిల్ 1 నుంచి బీఎస్ 3 ప్రమాణాలతో ఉన్న కార్లు, బైక్లు రదైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి బీఎస్ 4 వాహనాలు మాత్రమే అమ్మకాలు, రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. కాలుష్యాన్ని తగ్గించడం, రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు భద్రతా ప్రమాణాలు పెంచేందుకే ఇలా కొత్త వాహనాలకు నిర్దేశిత ప్రమాణాలను కేంద్రం సూచిస్తోంది. అందుకే 2020, ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త ప్రమాణాలు సిద్ధం చేసింది. ఆ తర్వాత బీఎస్ 6 ప్రమాణాలను అందుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2020 ఏప్రిల్ 1 తర్వాత బీఎస్ 4 వాహనాల విక్రయం, రిజిస్ట్రేషన్ చేయడాన్ని అత్యున్నత న్యాయస్థానం నిషేధించింది.