Supreme Court cancels bail of rape accused over 'Bhaiya is Back' posters
mictv telugu

రేప్ కేసు నిందితుడికి ఘనస్వాగతాలు.. గట్టి షాకిచ్చిన సుప్రీం

May 6, 2022

Supreme Court cancels bail of rape accused over 'Bhaiya is Back' posters

రేప్ కేసులో అరెస్టయిన నిందితుడికి బెయిల్‌ మంజూరైందని తెలిసి సంబరాలు చేశారు అతడి అనుచరులు. బెయిల్ వచ్చిందని స్వాగతిస్తూ అత్యాచార బాధితురాలు నివసిస్తున్న ప్రాంతంలో ‘అన్న తిరిగొచ్చాడు’ అంటూ పోస్టర్లు వేశారు. అతడేదో ఘనకార్యం చేసినట్లు సోషల్ మీడియాలో అతని గురించి ఒకటే రచ్చ. ఈ విషయం కాస్త సుప్రీం వరకూ వెళ్లడంతో దీనిపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితుడి బెయిల్ను రద్దు చేసింది. వారం రోజుల్లో లొంగిపోవాలని ఆదేశించింది.

నిందితుడు బెయిల్‌పై బయటకు వస్తే సాక్ష్యాధారాలను మార్చే అవకాశం ఉందని, బాధితురాలికి న్యాయం జరిగే అవకాశం ఉండదని ధర్మాసనం పేర్కొంది. అతగాడికి స్వాగతం చెబుతున్న తీరు చూస్తే… తనకింకా న్యాయం జరగదేమోనన్న ఆందోళన బాధితురాలికి కలిగించేలా ఉందని, ఈ పరిస్థితుల దృష్ట్యా నిందితుడు బెయిల్‌కు అర్హుడు కాదని భావిస్తున్నట్లు తెలిపింది. కాబట్టి మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ ఉత్తర్వులను రద్దు చేస్తున్నామని, వారం రోజుల్లో అతడు లొంగిపోవాలని పేర్కొంది.