సీజేఐ అభిశంసనకు వెంకయ్య తిరస్కరణ - MicTv.in - Telugu News
mictv telugu

సీజేఐ అభిశంసనకు వెంకయ్య తిరస్కరణ

April 23, 2018

భారత ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా అభిశంసన కోసం విపక్షాలు ఇచ్చిన నోటీసును ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు తిరస్కరించారు. దీనిపై న్యాయ నిపుణులతో విస్తృత సంప్రదింపులు జరిపి ఈ నిర్ణయం తీసుకున్నారు. జస్టిస్ మిశ్రా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, న్యయవ్యవస్థ స్వేచ్ఛను దెబ్బతీశారని కాంగ్రెస్ ఇతర విపక్షాలు అభిశంసనకు పూనుకున్నాయి. ఆయనను వెంటనే పదవి నుంచి తప్పించాలని కోరుతున్నాయి.దీని కోసం 64 మంది ఎంపీలు సంతకాలు అభిశంసన తీర్మానం నోటీసును గతవారం వెంకయ్యకు అందించాయి.  సీజేఐ మొత్తం ఐదు రకాల దుష్ప్రవర్తనకు తెగబడ్డారని విమర్శించాయి. దీనిపై వెంకయ్య  అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ సుదర్శన్‌ రెడ్డి, లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్‌ సుభాష్‌ కశ్యప్‌ తదితరులతో చర్చించారు. నోటీసును ఉపరాష్ట్రపతి తిరస్కరించిన నేపథ్యంలో ఈ వ్యవహారంపై వారు సుప్రీంకోర్టుకు వెళ్లాలని విపక్షాలు నిర్ణయించాయి. కోర్టులో పిటిషన్ వేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాయి.