న్యాయం పగలా మారొద్దు.. దిశ నిందితుల కాల్చివేతపై సుప్రీం చీఫ్ జస్టిస్  - MicTv.in - Telugu News
mictv telugu

న్యాయం పగలా మారొద్దు.. దిశ నిందితుల కాల్చివేతపై సుప్రీం చీఫ్ జస్టిస్ 

December 7, 2019

Supreme court chief justice bobde on disha accused issue 

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ను నిరసిస్తూ ఈ రోజు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. తెలంగాణ పోలీసులు ఎన్ కౌంటర్ల విషయంలో సుప్రీం కోర్టు నిర్దేశించిన మార్గదర్శకాలను పాటించడం లేని న్యాయవాదులు వాటిలో ఆరోపించారు. మరోపక్క.. ఎన్‌కౌంటర్ నేపథ్యంలో ఇటీవలే సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శరద్ అరవింద్ బాబ్డే బాబ్డే సంచలన వ్యాఖ్యలు చేశారు. 

‘న్యాయం ప్రతీకారంలా మారితే తన సహజ గుణాన్ని కోల్పోతుంది. న్యాయం పగ కాదు. న్యాయ విచారణ జరిగాకే శిక్షలు విధించాలి..’ అని ఆయన ఈ రోజు రాజస్తాన్ హైకోర్టులో జరిగిన ఓ కార్యక్రమంలో అన్నారు. నేరాల్లో న్యాయవ్యవస్థ పనితీరుపై పునశ్చరణ జరగాలన్న చర్చ మళ్లీ మొదలైందని ఆయన పేర్కొన్నారు. ‘న్యాయాన్ని ఉన్నపాటున కోరకూడదు. న్యాయం ఎప్పుడూ ప్రతీకార రూపం తీసుకోకూడదు. న్యాయవ్యవస్థ ఆత్మపరిశీలన చేసుకుని తన తప్పులు తాను దిద్దుకోవాలి. న్యాయప్రక్రియను వేగవంతం చేయడంతోపాటు కేసుకు ముందే మధ్యవర్తిత్వం వంటి మార్గాలను కూడా అనుసరించాలి’ అని సీజేఐ సూచించారు.