Supreme court chief justice uu lalit Uses Not Before Me In Amaravati Case
mictv telugu

అమరావతి కేసుపై విచారణకు సుప్రీం చీఫ్ జస్టిస్ నో…

November 1, 2022

ఎంతకూ తెగని ఆంధ్రప్రదేశ్ రాజధాని వ్యవహరం దేశ అత్యున్నత న్యాయస్థానంలోనూ మరిన్ని చిక్కుల్లోపడింది. రాజధాని కేసును విచారించడానికి న్యాయమూర్తి జస్టిస్ లలిత్ నిరాకరించారు. నాట్ బిఫోర్ అంటూ అంటూ విచారణ నుంచి తప్పుకున్న ఆయన కేసును మరో ధర్మాసనానికి బదిలీ చేయాలని సూచించారు. అమరావతిని రాష్ట్ర రాజధానిగానే ఉంచాలన్న హైకోర్టు తీర్పున జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో చేయడం తెలిసిందే. రైతులు కూడా తమ వాదన వినిపిస్తూ పిటిషన్లు చేశారు. వీటిని పరిశీలించిన సీజేఏ ఏపీ విభజన చట్టం అంశంపై ఇదివరకు తన నిర్ణయం వెలువరించానని, అందుకే వివచారణను మరో బెంచ్‌కు అప్పగించాలని కోరారు. కాగా రద్దయిన చట్టాలపై తీర్పు ఇవ్వడం మంచిదికాదంటూ హైకోర్టు తీర్పు అన్యాయమని రాష్ట్ర సర్కారు పేర్కొంది.

ప్రభుత్వానికి న్యాయ, పాలన, శాసన నిర్మానాల్లో పూర్తి హక్కులు ఉంటాయని తెలిపింది. ‘‘2014-19 మధ్య అమరావతిలో 10 శాతం మౌలిక వసతుల పనులు మాత్రమే సాగాయి. రాజధాని నిర్మాణానికి రూ.1,09,000 కోట్లు కావాలి. వికేంద్రీకరణకు 2000 కోట్లయితే సరిపోతాయి. గత ప్రభుత్వం రైతులను ఉద్ధరించిందేమీ లేదు. మేం వారికి నష్టం కలిగించలేదు. అమరావతి ఇకపైనా శాసన రాజధానే. ఆమేరకే అభివృద్ధి చేస్తాం. ఒకే రాజధాని ఉండాలని చట్టమేం లేదు. రాజధానిపై శివరామకృష్ణన్, జీ ఎన్ రావు, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్, హైపవర్డ్ కమిటీలు ఇచ్చిన నివేదికలను హైకోర్టు నిర్హేతుకంగా తోసిపుచ్చింది’ అని జగన్ సర్కారు వాదించింది.