ఆ పోలీసులకు చుక్కలే.. ప్రతి స్టేషన్‌లో సీసీ కెమెరాలు..  - MicTv.in - Telugu News
mictv telugu

ఆ పోలీసులకు చుక్కలే.. ప్రతి స్టేషన్‌లో సీసీ కెమెరాలు.. 

September 16, 2020

 

jjjjg

ఫ్రెండ్లీ పోలీసింగ్ అని ఎన్ని కబుర్లు చెప్పినా పోలీసోళ్లపై ప్రజల్లో అభిప్రాయమేమీ మారడం లేదు.  కొందరి కారణంగా మొత్తం పోలీసులు పరువు పోతోంది. లాకప్ డెత్, బెదరింపులు, వసూళ్లు, అక్రమార్కులకు అండాదండ ఆరోపణలతో ఆ వ్యవస్థపై నమ్మకం లేని పరిస్థితి నెలకొంది. ఏపీలో ఓ దళితుడికి స్టేషన్‌లో శిరోముండనం చేయించడం కలకలకం రేపడం తెలిసిందే. కొన్ని స్టేషన్‌లలో మాటల్లో చెప్పలేని ఘోరాలు కూడా జరగుతుంటాయి. ఏకంగా మద్యం తాగి అల్లరి చేయడం చాలా సార్లు చూశాం కూడా. అందుకే సుప్రీం కోర్టు జూలు విదిలించింది. ప్రతి ఠాణాలోనూ సీసీకెమెరాలను ఏర్పాటు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. 

పోలీసింగ్ వ్యవస్థను పారదర్శకంగా మార్చాలని కోర్టు ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు స్పష్టం చేసింది. ‘ఇది చాలా అవసరం. ప్రజల ప్రాథమిక హక్కులకు సంబంధినది. పోలీసు స్టేషన్లలో సీసీటీవీ కెమెరాలతోపాటు  సాక్షుల ఇచ్చే వాంగ్మూల ఆడియో వీడియో రికార్డింగులు కూడా ఉండాలి. ఈ విషయంలో ఎంతవరకు పని చేశారో మాకు చెప్పాలి’ అని కోర్టు అటార్నీ జనరల్ కె.కె.వేణుగోపాల్‌ను ఆదేశించింది.