సుశాంత్ కేసులో మరో మలుపు..పిటీషన్ ను కొట్టేసిన సుప్రీం - MicTv.in - Telugu News
mictv telugu

సుశాంత్ కేసులో మరో మలుపు..పిటీషన్ ను కొట్టేసిన సుప్రీం

July 31, 2020

Supreme court dismiss petition about sushant singh rajput

బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ప్రస్తుతం ఈ కేసును ముంబై పోలీసులు విచారిస్తున్న సంగతి తెల్సిందే. అయితే ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అల్కా ప్రియ అనే యువతి సుప్రీం కోర్టులో ఈమేర పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్ ను ఈరోజు సుప్రీం ధర్మాసనం కొట్టివేసింది. ఈ కేసును ముంబై పోలీసులు విచారిస్తున్నారు. వారి పనిని వారిని చేసుకోనివ్వాలని వ్యాఖ్యానించింది. ఈ కేసులో ఇప్పటికే ముంబై పోలీసులు దాదాపు 40 మందిని విచారించారు. 

ఇదిలా ఉంటే సుశాంత్‌ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తిపై పాట్నా పోలీసులకు అతడి తండ్రి ఫిర్యాదు చేసిన సంగతి తెల్సిందే. తన కుమారుడి బ్యాంక్ ఖాతా నుంచి 15 కోట్లు బదిలీ అయ్యాయనీ, అవి రియా అకౌంటుకు వెళ్లాయని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే, తనపై నమోదైన పాట్నాలో నమోదైన కేసును ముంబైకి బదిలీ చేయాలని రియా ఇటీవల సుప్రీంకోర్టులో పిటిషన్‌ దానిని సుప్రీం కోర్టు కొట్టేసింది. ఇప్పటికే పాట్నాకు చెందిన నలుగురు పోలీసుల బృందం ముంబైకి వచ్చాయి దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల సుశాంత్ బ్యాంకు అకౌంట్ ఉన్న బ్యాంకుకి వెళ్లి లావాదేవీలపై విచారణ జరిపారు.