Supreme Court dismissed Lakshmi Parvati ‘s petition that seeking an inquiry into Chandrababu's assets
mictv telugu

చంద్రబాబు ఆస్తులపై వేసిన పిటిషన్ కొట్టివేత.. లక్ష్మీ పార్వతికి షాక్

September 9, 2022

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆస్తులపై విచారణ జరపాలన్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ వ్యాజ్యాన్ని లక్ష్మీపార్వతి దాఖలు చేశారు. విచారణ సందర్భంగా సుప్రీం ధర్మాసనం స్పందిస్తూ.. ఒకరి ఆస్తులు తెలుసుకోవడానికి మీరెవరని లక్ష్మీపార్వతిని ప్రశ్నించింది. ‘‘హైకోర్టు అన్నివిధాలా ఆలోచించే పిటిషన్‌ను కొట్టివేసింది. ఎవరి ఆస్తులు.. ఎవరికి తెలియాలి? మీరు లేవనెత్తిన అంశానికి విలువ లేదు’’ అని పేర్కొంటూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు డిస్మిస్‌ చేసింది.

ఇదిలా ఉండగా, గతనెల ఆత్మహత్య చేసుకుని చనిపోయిన ఎన్టీఆర్ చిన్న కూతురు ఉమామహేశ్వరి తను చనిపోయే ముందు లేఖ రాసిందని లక్ష్మీ పార్వతి తెలిపారు. ఆగస్ట్ మూడున ఆమె మీడియాతో మాట్లాడారు. ఆ ప్రదేశానికి చంద్రబాబు నాయుడు వెళ్లాక ఆ లేఖ మాయమైందని ఆమె ఆరోపించారు. చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ కుటుంబానికి శనిలాంటి వాడని ఆమె వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ కుమార్తె ఉమా మహేశ్వరి మృతి మిస్టరీగా మారిందన్నారు. ఉమా మహేశ్వరి మృతి వెనుక ఏదో జరిగి ఉంటుందనే అనుమానాన్ని ఆమె వ్యక్తం చేశారు.