అయోధ్య తీర్పు..18 రివ్యూ పిటిషన్ల తిరస్కరణ - MicTv.in - Telugu News
mictv telugu

అయోధ్య తీర్పు..18 రివ్యూ పిటిషన్ల తిరస్కరణ

December 12, 2019

Supreme Court Dismisses.

నవంబర్ 9న సుప్రీం కోర్టు అయోధ్య కేసులో సంచలన తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. వివాదాస్పద 2.77 ఎకరాల భూమిని రామమందిర నిర్మాణానికి వీలుగా రామ్ లల్లాకు కేటాయించాలని సుప్రీం తీర్పు ఇచ్చింది. మసీదు నిర్మాణం కోసం ఐదు ఎకరాల భూమిని సున్నీ వక్ఫ్ బోర్డుకు కేటాయించాలని కేంద్రాన్ని ఆదేశించింది.

తాజాగా ఈ తీర్పును సమీక్షించాలంటూ సుప్రీం కోర్టులో 18 రివ్యూ రివ్యూ పిటిషన్లు దాఖలయ్యాయి. డిసెంబర్ 2న సుప్రీంలో తొలి రివ్యూ పిటిషన్ దాఖలైంది. జమయత్ ఉలామా ఇ హింద్ ఉత్తరప్రదేశ్ విభాగం అధ్యక్షుడు మౌలానా సయ్యద్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. డిసెంబర్ 6న మరో ఆరు రివ్యూ పిటిషన్లు దాఖలయ్యాయి. డిసెంబర్ 9న రెండు రివ్యూ పిటిషన్లు దాఖలయ్యాయి. మొత్తం ఇప్పటివరకు 18 రివ్యూ పిటిషన్లు దాఖలయ్యాయి. వాటన్నింటిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఐదురుగు సభ్యుల రాజ్యంగా ధర్మాసనం రివ్యూ పిటిషన్‌లపై ఛాంబర్‌లో అంతర్గత విచారణ జరిపింది. సీజే జస్టిస్ బోబ్డే నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల బృందం పిటిషన్లను తిరస్కరించింది.