Home > Featured > మద్యం దుకాణాలపై పిటిషన్… లాయర్‌కు లక్ష జరిమానా

మద్యం దుకాణాలపై పిటిషన్… లాయర్‌కు లక్ష జరిమానా

Lockdown

సుప్రీం ధర్మాసనం ఓ న్యాయవాదికి ఊహించని షాక్ ఇచ్చింది. ఆయనకు ఏకంగా లక్ష రూపాయల జరిమానాను విధించింది. లిక్కర్ షాపులను తెరవడంపై పిటిషన్ వేసినందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ ఆదేశాలు ఇచ్చింది. లాక్‌డౌన్ సమయంలో మద్యం దుకాణాలు తెరవడంపై వేసిన పిటిషన్‌ను శుక్రవారం విచారించింది. ఒకే విషయంపై ఎక్కువ మంది పిటిషన్లు వేయడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.

దేశవ్యాప్తంగా ఇటీవల కేంద్రం మద్యం అమ్మకాలు జరిపేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో ఆయా రాష్ట్రాల్లో దుకాణాలు తెరుచుకోవడంతో మందు బాబులు ఎగబడ్డారు. ఈ సందర్భంగా ఎవరూ భౌతిక దూరం పాటించడం లేదని, దీని ద్వారా వైరస్ వ్యాపిస్తుందని పలువురు ఆరోపిస్తున్నారు. వెంటనే లిక్కర్ షాపులను మూసివేసేలా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు. దీనిపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం ఈ అంశంపై ఎంత మంది పిటిషన్లు వేస్తారని ప్రశ్నించింది. ఈ వ్యవహారాన్ని ప్రచారం కోసం వాడుకుంటున్నారని కోర్టు వ్యాఖ్యానించింది. ఇలా చేయడం వల్ల కోర్టు సమయం వృథా అవుతోందని అభిప్రాయపడింది.

Updated : 15 May 2020 2:55 AM GMT
Tags:    
Next Story
Share it
Top