టీచర్ పోస్టుల భర్తీలో జాప్యమెందుకు? - MicTv.in - Telugu News
mictv telugu

టీచర్ పోస్టుల భర్తీలో జాప్యమెందుకు?

September 11, 2017

తెలంగాణలో  టీచర్ పోస్ట్ ల భర్తీ పై జరుగుతున్న ఆలస్యంపై  సుప్రీం కోర్టు మండిపడింది. గతంలో కేసు విచారణ సమయంలో సెప్టెంబర్ లోపే నియామకాలు పూర్తి చేస్తామని చెప్పి.. ఇపుడు మళ్లీ సమయం కావాలని ప్రభుత్వం కోరడాన్ని తప్పుబట్టింది. దీనిపై వివరణ ఇచ్చేందుకు విద్యాశాఖ కార్యదర్శి నేరుగా కోర్టుముందు హాజరుకావాలని ఆదేశించింది.  విద్యార్థులు లేరన్న కారణంతో పాఠశాలలను మూసివేస్తూ. ఖాళీల భర్తీ ఆపారంటూ సుప్రీం కోర్టు ముందు పిటిషన్ దాఖలైంది. దీనిపై గతంలో విచారణ జరిపింది కోర్టు. పిటిషనర్లు, ప్రభుత్వం తరఫున వాదనలు విన్న తర్వాత.. సెప్టెంబర్ లో టీచర్ల నియామకాలు పూర్తి చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది. కానీ నియమకాలు పూర్తికాలేదు. దీనిపై సెప్టెంబర్11 మరోసారి విచారణకు రావడంతో ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించింది కోర్టు. అయితే కొత్త జిల్లాల ఏర్పాటు కారణంగా నియామక ప్రక్రియ కొద్దిగా ఆలస్యమైందని అధికారులు వివరణ ఇచ్చారు. కానీ ఈ వాదనను సుప్రీం కోర్టు అంగీకరించలేదు. పాత కథలు చెప్పొద్దంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని మందలించింది. వెంటనే టీచర్ల పోస్టులను భర్తీ చెయ్యాలని ఆదేశించింది.