ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో చిదంబరానికి ఊరట - MicTv.in - Telugu News
mictv telugu

ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో చిదంబరానికి ఊరట

December 4, 2019

Chidambaram022

 

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి చిదంబరానికి ఊరట లభించింది. ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ బుధవారం సుప్రీం కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. పలు షరతులతో ఈ ఊరట లభించింది. రూ. 2 లక్షల పూచీకత్తుతో పాటు దేశం విడిచి వెళ్లరాదని ఆదేశించింది. కేసు విషయాలపై బయట ఎటువంటి వ్యాఖ్యలు చేయవద్దని సూచించింది. దీంతో సుమారు 106 రోజుల తర్వాత ఆయన తీహార్ జైలు నుంచి బయటకు రానున్నారు. 

ఐఎన్ఎక్స్ మీడియాలో నిబంధనలకు విరుద్దంగా విదేశీ డబ్బును తరలించారని ఆయన్ను ఈడీ అదుపులోకి తీసుకుంది. అప్పటి నుంచి జైలులోనే విచారించారు. అరెస్టు ఆయన అనేక సార్లు బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నారు. తీవ్రమైన ఆర్థిక నేరారోపణ ఉండటంతో ఆయన సాక్షులను ప్రభావితం చేస్తారని ఈడీ ధర్మాసనానికి తెలిపింది. దీంతో చాలా సార్లు ఆయనకు బెయిల్ మంజూకాలేదు. దీంతో 106 రోజులు ఆయన తీహార్ జైలులోనే ఉన్నారు. తాజాగా మరోసారి ఆయన బెయిల్ పిటిషన్‌పై సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ భానుమతి విచారణ చేపట్టారు. ఈడీ వాదన విభేదించారు. ఆంక్షలతో కూడిన బెయిల్ ఇచ్చేందుకు అంగీకరించారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ హర్షం వ్యక్తం చేసింది. కాగా ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరం ఆగస్టు 21 అరెస్ట్ అయ్యారు. అప్పటి నుంచి ఆయన తీహార్ జైలులో ఉన్నారు.