ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై విచారించిన సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రానికి నోటీసులు జారీ చేసింది. 2014లో విభజన చట్టంలోని షెడ్యూల్ తొమ్మిది పదిలో ఉన్న సంస్థలను తక్షణమే విభజించాలని, ఈ రెండు షెడ్యూలుకి సంబంధించిన 91 సంస్థలు తెలంగాణలోనే ఉన్నాయని పిటిషన్ లో పేర్కొంది. ఈ సంస్థల ఆస్తుల విలువ రూ. 1 లక్షా 42 వేల 601 కోట్లని స్పష్టం చేసింది. ఇందులో ప్రతివాదులుగా తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాన్ని చేర్చింది. సంస్థల విభజన అంశంలో తెలంగాణ నుంచి సహకారం లేదని కోర్టు ముందు విన్నవించింది. విచారించిన కోర్టు.. తెలంగాణ స్పందించపోవడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘన అంటూ అభిప్రాయపడింది. ఈ మేరకు నోటీసులు జారీ చేస్తూ విచారణను వాయిదా వేసింది.