Supreme court hearing on Delhi cracker ban; 'Let people breathe, spend money on sweets'
mictv telugu

బాణసంచా బదులు, స్వీట్లు కొనుక్కోండి.. సుప్రీం కోర్టు సలహా

October 20, 2022

ఢిల్లీలో కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో దీపావళి రోజు బాణసంచా కొన్నా అమ్మినా జరిమానా, జైలు శిక్ష పడేలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నిషేధం పంచాయితీ సుప్రీం కోర్టుకు చేరింది. ఏడాదికొక్కసారి కూడా బాణసంచా కాల్చుకోనివ్వకపోవడం అన్యాయమంటూ కొందరు గురువారం పిటిషన్ వేశారు. పండగ దగ్గర్లోనే ఉండడంతో అత్యవసరంగా విచారణ జరిపించాలని కోరారు. అయితే కోర్టు అందుకు నిరాకరించింది. అంతేకాకుండా కొన్ని ఉచిత సలహాలు కూడా ఇచ్చింది. ‘అంత త్వరగా విచారణ జరపాల్సిన అవసరం లేదు.
‘ఈ పిటిషన్ పై ఇప్పటికిప్పుడు విచారణ చేపట్టాల్సిన అవసరం లేదు. నిషేధంపై ఎందుకంత ఇబ్బంది పడతారు? జనం కాస్త మంచి గాలి పీల్చుకోనీయండి. బాణసంచా కొనే బదులు స్వీట్లు కొనుక్కోండి’ అని సలహా ఇచ్చింది. ఇలాంటి పిటిషన్‌నే ఢిల్లీ హైకోర్టు కూడా ఇలాంటి పిటిషన్‌ను తోసిపుచ్చింది. ఢిల్లీ పేలుడు పదార్థాల చట్టం ప్రకారం బాణసంచాను నిల్వచేసి అమ్మితే రూ. 5 వేల జరిమానా, గరిష్టంగా మూడేళ్ల జైలు శిక్ష పడుతుందని ప్రభుత్వం బుధవారం హెచ్చరించింది. ఢిల్లీ చుట్టుపక్కల రాష్ట్రాల్లో పంటవ్యర్థాల కాల్చివేత, భారీగా పెరిగిన వాహన ఉద్గారాలతో నగరం కాలుష్యానికి అడ్డాగా మారుతున్న సంగతి తెలిసిందే.