రాహుల్ అనర్హుడు అన్నందుకు లక్ష జరిమానా  - MicTv.in - Telugu News
mictv telugu

రాహుల్ అనర్హుడు అన్నందుకు లక్ష జరిమానా 

November 2, 2020

ఎంపీగా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్‌పై తీర్పు వెలువడింది. పనికిమాలిన దావాలతో తమ విలువైన సమయాన్ని వృథా చేశారంటూ పిటిషనర్‌కు కోర్టు లక్ష రూపాలయ జరిమానా విధించింది. రాహుల్ కేరళలోని వయనాడ్ నుంచి గత పార్లమెంటు ఎన్నికల్లో లోక్ సభకు ఎన్నికైన సంగతి తెలిసిందే. అయితే ఆ ఎన్నిక అక్రమంటూ సరితా నాయర్ అనే మహిళ సుప్రీం కోర్టు గడప తొక్కింది. సోలార్ పరికరాల కుంభకోణంలో దోషిగా తేలిన సరిత.. రాహుల్‌పై కోర్టు వెళ్లడం వెనక రాజకీయ కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. 

ఆమె పిటిషన్‌ను విచారించిన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసం తీవ్రంగా మందలించిది. సరితకు లక్ష రూపాయల జరిమానా విధిస్తున్నట్టు ప్రకటించింది. సోలార్ స్కాంలో సరిత, ఆమె భర్త బిజూ రాధాకృష్ణన్‌లకు గత ఏడాది మూడేళ్ల జైలుశిక్ష పడింది. తర్వాత ఆమె ఎర్నాకుళంతోపాటు, వయనాడ్ లోక్‌సభ స్థానాల నుంచి పోటీ చేయడానికి యత్నించింది. అయితే కేసుల్లో దోషిగా తేలడంతో పోటీ చేయడానికి వీల్లేకపోయింది. దీంతో ఆమె ఎన్నికలు సరిగ్గా జరగలేదని, రాహుల్ ఎన్నికను కొట్టేయాలని తొలుత రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించింది. ఆ కోర్టు కొట్టేయడంతో అత్యుతన్నత న్యాయస్థానంలో పిటిషన్ వేసింది.