సుప్రీంకోర్ట్ కీలక వ్యాఖ్యలు.. ఎవరినీ ఒత్తిడి చేయకండి - MicTv.in - Telugu News
mictv telugu

సుప్రీంకోర్ట్ కీలక వ్యాఖ్యలు.. ఎవరినీ ఒత్తిడి చేయకండి

May 3, 2022

భారతదేశ అత్యున్నత న్యాయస్థానం (సుప్రీంకోర్ట్) కరోనా వ్యాక్సిన్ విషయంలో కీలక వ్యాఖ్యలు చేసింది. ఎవరినీ కూడా ఒత్తిడి చేయకండి అని తేల్చి చెప్పింది. రెండు సంవత్సరాలపాటు యావత్ ప్రపంచాన్ని అతలకుతలం చేసిన కరోనా మహ్మరిని కట్టడి చేయడానికి భారత్‌పాటు పలు దేశాల వైద్యులు వ్యాక్సిన్లు తయారు చేసిన విషయం తెలిసిందే. భారతదేశంలో వైద్యులు తయారుచేసిన కరోనాకు వ్యాక్సిన్లకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది.

ఆరోజు నుంచి ఈరోజు వరకు వైద్యులు దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో వ్యాక్సిన్లు వేస్తున్నారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా దాదాపు 190 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్లు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం విద్యార్థులకు సైతం వ్యాక్సిన్ వేస్తున్నామని, మూడోవ డోసు కూడా ప్రజలకు అందుబాటులోకి వచ్చిందని వైద్యశాఖ తెలిపింది.

వ్యాక్సినేషన్‌కు సంబంధించి సుప్రీంకోర్టు ఇటీవలే విచారణ చేపట్టింది. ఇందులో భాగంగా పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ”కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలంటూ ఏ ఒక్క వ్యక్తిని కూడా ఒత్తిడి చేయలేం. ఈ విషయంలో ఎవరినీ ఒత్తిడి చేయరాదు. ప్రస్తుత వ్యాక్సిన్ విధానం సంతృప్తికరంగా ఉంది.

వ్యాక్సినేషన్ పాలసీ ఏకపక్షంగా ఉందని చెప్పలేం. సమాజ హితం కోసం పాలసీ తయారు చేసి, అమలు చేసే అధికారం ప్రభుత్వానికే ఉంది. వ్యాక్సిన్ వేయించుకోలేదు అనే కారణంతో కొన్ని రాష్ట్రాలు, సంస్థలు వ్యక్తులను పబ్లిక్ ప్రదేశాలకు అనుమతించడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి. ఇది కరెక్ట్ కాదు. ప్రస్తుతం కరోనా కేసులు తక్కువగా ఉన్నాయి. ఇప్పటికైనా అలాంటి నిర్ణయాలను ఉంటే మానుకొండి” అని తెలిపింది.