ఆరేళ్లకు.. శ్రీశాంత్‌పై నిషేధం ఎత్తివేత - MicTv.in - Telugu News
mictv telugu

ఆరేళ్లకు.. శ్రీశాంత్‌పై నిషేధం ఎత్తివేత

March 15, 2019

టీం ఇండియా క్రికెటర్ శ్రీశాంత్‌కు పెద్ద ఊరట లభించింది. మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో అతనిపై నిషేధాన్ని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఈ రోజు ఎత్తేసింది. బీసీసీఐ అతనిపై విధించిన జీవితకాల నిషేధం మరీ దారుణంగా ఉందని కోర్టు పేర్కొంది. జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని బెంచ్ కేసును విచారించింది.


నిషేధం విషయంలో మూడు నెలల్లోగా తాజాగా మరో నిర్ణయం తీసుకోవాలని కోర్టు బీసీసీఐని ఆదేశించింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌‌లో శ్రీశాంత్ స్పాట్ ఫిక్సింగ్‌కి పాల్పడుతూ పట్టుబడ్డం తెలిసిందే. దీంతో నిబంధనల ప్రకారం బీసీసీఐ అతనిపై జీవితకాల నిషేధాన్ని విధించింది. మన దేశం తరఫున శ్రీశాంత్ 27 టెస్టులు, 58 వన్గేలు, 10 టీ20 మ్యాచులు ఆడాడు. నిషేధం నేపథ్యంలో సినిమాలపై దృష్టి పెట్టు. కానీ అంతగా రాణించలేకపోయాడు. హిందీ బిగ్‌బాస్‌లో పాల్గొన్న శ్రీశాంత్ కన్నీళ్లు పెట్టుకుని, తలబాదుకుని మళ్లీ వార్తల్లోకి ఎక్కాడు. ఆ సీజన్ రన్నర్ అప్‌గా నిలిచాడు.