రామోజీరావుకు సుప్రీం కోర్టు నోటీసులు - MicTv.in - Telugu News
mictv telugu

రామోజీరావుకు సుప్రీం కోర్టు నోటీసులు

August 11, 2020

Supreme Court Notice to Ramoji Rao

ఆర్‌బీఐ నిబంధనలకు విరుద్ధంగా మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీలో డిపాజిట్లు సేకరించారనే ఆరోపణలపై సుప్రీం కోర్టు విచారించింది. ఈ సందర్భంగా ఆయనకు నోటీసులు జారీ చేసింది. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించి  మార్గదర్శి సంస్థతో పాటు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు, మాజీ ఐపీఎస్‌ అధికారి కృష్ణంరాజుకు కూడా నోటీసులు  ఇచ్చింది. దీనిపై వివరణ ఇవ్వాలని త్రిసభ్య ధర్మాసనం కోరింది. 

నిబంధనలకు విరుద్ధంగా మార్గదర్శి సంస్థ రూ.2,600 కోట్ల మేరకు డిపాజిట్లు సేకరించిందని అప్పట్లోట్రయల్‌ కోర్టులోక్రిమినల్‌ ఫిటిషన్ దాఖలైంది. దీన్ని కొట్టివేయాలంటూ ఆ సంస్థ హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ వేయడంతో 2018 డిసెంబరు 31న హైకోర్టు కొట్టివేసింది. దీన్ని సవాల్ చేస్తూ ఉండవల్లి అరుణ్ కుమార్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీనిపై జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌, జస్టిస్‌ ఆర్‌ సుభాష్‌ రెడ్డి, జస్టిస్‌ ఎంఆర్‌ షాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రతివాదులుగా ఆర్బీఐని కూడా చేర్చి నోటీసులు ఇచ్చింది. అత్యున్నత న్యాయస్థానంలో ఈ కేసు ఎలాంటి మలుపు తిరుగుతుందనేది ఆసక్తిగా మారింది.