Supreme Court notices to Balakrishna
mictv telugu

బాలయ్యను వెంటాడుతున్న వందో చిత్రం.. సుప్రీంకోర్టు నోటీసులు

August 29, 2022

టాలీవుడ్ అగ్రనటుడు నందమూరి బాలకృష్ణ, తెలంగాణ, ఏపీ రాష్ట్ర ప్రభుత్వాలకు సోమవారం సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. వీరితో పాటు గౌతమీ పుత్ర శాతకర్ణి, రుద్రమదేవి చిత్రనిర్మాతలకు కూడా నోటీసులు పంపింది. పై రెండు చిత్రాలకు ప్రభుత్వాల నుంచి పన్ను రాయితీ తీసుకొని వాటిని ప్రేక్షకులకు బదిలీ చేయలేదనే అభియోగం మీద నాలుగు వారాల్లో స్పందించాలని నోటీసులో పేర్కొంది. సినిమా ప్రేక్షకుల వినియోగదారుల సంఘం ఈ మేరకు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం విచారణకు స్వీకరించింది. రుద్రమదేవికి తెలంగాణలో రాయితీ ఇవ్వగా, గౌతమీ పుత్ర శాతకర్ణికి రెండు తెలుగు రాష్ట్రాల్లో రాయితీ ఇచ్చారు. అయితే పన్ను ప్రయోజనాలు పొంది వాటిని ప్రేక్షకులకు బదిలీ చేయనుందున ఆ మేరకు ఆ సొమ్మును ప్రభుత్వాల నుంచి రాబట్టాలని పిటిషన్‌లో కోరారు. ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ డీవై చంద్రచూడ్, వాదనలు విన్న అనంతరం పైన చెప్పినట్టు నోటీసులిస్తూ నాలుగు వారాల్లో స్పందించాలని ఆదేశించింది.