వ్యభిచారం నేరం కాదని, సెక్స్ వర్కర్లు కూడా అందరిలాంటి మనుషులేనని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. వారిని వేధించవద్దని పోలీసులను గట్టిగా హెచ్చరించింది. సెక్స్ వర్కర్లపై వేధింపులపై దాఖలైన కేసుపై జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు, జస్టిస్ బి.ఆర్.గావై, జస్టిస్ ఎ.ఎస్.బోపన్నల బెంచ్ విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది.
‘పోలీసులు సెక్స్ వర్కర్లను వేధించకూడదు, తిట్టకూడదు, కొట్టకూడదు. వారి పనిని వృత్తిగా గౌరవించాల్సిన అవసరముంది. సెక్స్ వర్కర్లకు గౌరవ మర్యాదల భద్రత కల్పించడానికి చట్టం లేకపోవడంతో మేం జోక్యం చేసుకుంటున్నాం. వారి రక్షణలో సెక్స్ వర్కర్ల ఫొటోలు, గుర్తింపును బయటపెట్టొద్దని మీడియాను ఆదేశిస్తాం. ఐపీసీ సెక్షన్ 354సీ ప్రకారం.. ఇతరులు శారీరకంగా కలుసుకున్నప్పుడు తొంగి చూడ్డం నేరం. ఈ విషయంలో మార్గదర్శకాలు రూపొందించాని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు సూచిస్తున్నారు’ అని కోర్టు పేర్కొంది