ఏబీ వెంకటేశ్వరరావుకు ఊరట.. విధుల్లోకి తీసుకోవాలని సుప్రీం ఆదేశం - MicTv.in - Telugu News
mictv telugu

ఏబీ వెంకటేశ్వరరావుకు ఊరట.. విధుల్లోకి తీసుకోవాలని సుప్రీం ఆదేశం

April 22, 2022

15

నిఘా పరికరాల కొనుగోలులో అక్రమాలకు పాల్పడ్డారంటూ మాజీ ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరావుపై విధించిన సస్పెన్సన్‌ను ఎత్తివేసి వెంటనే విధుల్లోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఐపీఎస్ అధికారిని రెండేళ్లకు మించి సస్పెండ్ చేయడం నిబంధనలకు విరుద్దమని వెల్లడించింది. తక్షణమే ఆయనను సర్వీసులోకి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. కాగా, టీడీపీ హయాంలో జరిగిన అక్రమాలపై వైసీపీ అధికారంలోకి వచ్చి విచారించి ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ విధించిన విషయం తెలిసిందే. అయితే సస్పెన్షన్ విధించి రెండేళ్లవుతున్నా, తనను విధుల్లోకి తీసుకోవట్లేదంటూ ఏబీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై ఇంతకుముందే విచారణను ముగించిన సుప్రీంకోర్టు తీర్పను వాయిదా వేసింది. తాజాగా సర్వీసులోకి తీసుకోవాలని ఆదేశించింది.