‘సీఎం సహా నలుగురు నాపై అత్యాచారం చేశారు’ - MicTv.in - Telugu News
mictv telugu

‘సీఎం సహా నలుగురు నాపై అత్యాచారం చేశారు’

March 15, 2019

తనపై అరుణాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండుతో పాటు మరో ముగ్గురు అత్యాచారం చేశారని ఓ మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. 2008లో జరిగిన ఈ ఘటనలో తాము జోక్యం చేసుకోలేమని సీజేఐ రంజన్ గొగోయ్, దీపక్ మిశ్రా, సంజీవ్ ఖన్నాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. దీనిపై హైకోర్టును ఆశ్రయించి, ఆమెకు రక్షణ కల్పించాలని పోలీసులను సంప్రదించాలని సూచించింది. ముఖ్యమంత్రి పెమా ఖండుకు వ్యతిరేకంగా తాను ఫిర్యాదు చేయడంతో చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్, పోలీసులు స్వీకరించినందువల్లే సుప్రీంకోర్టును ఆశ్రయించానని మహిళ పేర్కొంది.

Supreme Court refuses to hear plea by woman who alleged that Arunachal Pradesh CM raped her.

సదరు మహిళ ఏమని ఫిర్యాదు చేసిందంటే.. ‘నేను 15ఏళ్ల వయసులో ఉన్నప్పుడు సీఎం పెమా ఖండు మరో ముగ్గురు నాపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ సమయంలో నేను పబ్లిక్ కాల్ ఆఫీసులో పనిచేస్తున్నాను. అప్పుడు ఓ వ్యక్తి నా దగ్గరికి వచ్చి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పాడు. అది నమ్మిన నేను ఒకరోజు వారిని కలవడానికి వెళ్లాను. అప్పుడు నాకు కూల్‌డ్రింకులో మత్తుమందు కలిపి ఇచ్చారు. అది తాగిన నేను స్పృహ తప్పిపోయాను. ఆ తర్వాత నలుగురు నాపై అత్యాచారం చేశారు’ అని పేర్కొంది.  2018లో జాతీయ కమిషన్‌కు కూడా ఫిర్యాదు బాధిత మహిళ ఫిర్యాదు చేసింది.

ఇప్పటి వరకు తనకు కోర్టు నుంచి గానీ, పోలీసుల నుంచి ఎలాంటి స్పందన రావడం లేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. తాను చెప్పేదంతా అబద్ధమని, కట్టుకథలు సృష్టిస్తున్నారని కన్నీరుపెట్టుకుంది. తనకు న్యాయం జరక్కపోతే.. నాలాంటి బాధితులకు వ్యవస్థపై నమ్మకం పోతుందని ఆవేదన వ్యక్తం చేసింది. మహిళ చేస్తున్న ఆరోపణలను సీఎం పెమా ఖండించారు.