ఐలయ్య పుస్తకాన్ని నిషేధించలేం

సామాజిక విశ్లేషకుడు ప్రొఫెసర్ కంచ ఐలయ్య రాసిన వివాదాస్పద ‘సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు’ పుస్తకాన్ని నిషేధించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాన్ని దేశ సర్వోన్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు శుక్రవారం కొట్టేసింది. ‘ఈ పుస్తకాన్ని నిషేధించడమంటే భావ ప్రకటన స్వేచ్ఛకు విఘాతం కలిగించడమే. రచయితకు చట్టపరిధిలో తన భావాలను వ్యక్తపరిచే స్వేచ్ఛ ఉంది. గతంలోనూ పుస్తకాల శీర్షికలపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అవి అభ్యంతరాలే. వాటిని ఆధారంగా చూపి పుస్తకాలను నిషేధించలేం’ అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

ఈ పుస్తకం కోమట్లను కించపరిచేలా, వారి పరువు తీసేలా ఉందని  వీరాంజనేయులు అనే వ్యక్తి ఈ పిటిషన్‌ వేశాడు. ఈ పుస్తకంపై తెలుగు రాష్రాల్లో వైశ్యులు తీవ్ర ఆందోళన చేయడం, చివరకు ఐలయ్యపై దాడికి యత్నించడం తెలిసిందే. అయితే తాను నిజాలే రాశానని, కావాలంటే చర్చకు రావాలని ఆయన సవాల్ విసురుతున్నారు.

SHARE