బీసీల 50 శాతం రిజర్వేన్లకు సుప్రీం కోర్టు నో - MicTv.in - Telugu News
mictv telugu

బీసీల 50 శాతం రిజర్వేన్లకు సుప్రీం కోర్టు నో

October 26, 2020

సుప్రీం కోర్టు

2006లో తీసుకొచ్చిన చట్టం ప్రకారం ఓబీసీలకు 27శాతం రిజర్వేషన్లు అమలు అవుతున్న సంగతి తెల్సిందే. ఇదిలా ఉంటే తమిళనాడులోని మెడికల్ కాలేజీల్లో ఓబీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వంతో సహా డీఎంకే, అన్నాడీఎంకే, సీపీఎం రాజకీయ పార్టీలు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. ఈ పిటిషన్‌ను‌ విచారణను స్వీకరించేందుకు సుప్రీం కోర్టు తిరస్కరించింది. 

”తమిళనాడులో వెనుకబడిన తరగతుల సంక్షేమం కోసం అన్ని రాజకీయ పార్టీలూ కలిసి వచ్చాయి. ఇది ఒక అసాధరణ విషయం. కానీ, రిజర్వేషన్ ప్రాథమిక హక్కు కాదనే నిర్ణయానికే సుప్రీంకోర్టు కట్టుబడి ఉంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 పౌరులకు సమానత్వ హక్కును కల్పిస్తోంది. రిజర్వేన్లను అందుకు మినహాయింపుగా సూచించింది.” అని సుప్రీం కోర్టు పేర్కొంది. ఈ విషయంలో రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించే స్వేచ్ఛ పిటిషనర్లకు ఉందని సుప్రీం కోర్టు తెలిపింది. ఓబీసీ రిజర్వేషన్లను అమలుచేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని తమిళనాడు ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఫలితంగా గత మూడేళ్ళలో రాష్ట్రంలోని 10 వేల మెడికల్ కాలేజీ సీట్లను ఇతరులు తీసుకున్నారని తెలిపింది.